Homeఅంతర్జాతీయంపుతిన్‌కు 10`12 రోజులే గడువు

పుతిన్‌కు 10`12 రోజులే గడువు

- Advertisement -

ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడంపై ట్రంప్‌: శాంతికి పిలుపు

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌రష్యా మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపుని చ్చారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపేందుకు రష్యాకు విధించిన 50 రోజుల డెడ్‌లైన్‌ను కుదిస్తున్నట్లు ఆయన మంగళవారం వెల్లడిరచారు. ఉక్రెయిన్‌లో రక్తపాతం ఆపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు 1012 రోజుల సమయం మాత్రమే ఇస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఆగస్టు 79 తేదీల్లోగా పురోగతిని ఆశిస్తు న్నట్లు చెప్పారు. ‘ఇక ఆగి ప్రయోజ నం లేదు. మాకు పురోగతి కావాలి. పుతిన్‌ ఒప్పందానికి ముందు రావాలి. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు’ అని స్కాట్లాండ్‌ పర్యట నలో ఉన్న ట్రంప్‌ అన్నారు. యుద్ధం ఆపుతామని చెబుతూనే దాడులు కొనసాగిస్తున్నారని పుతిన్‌ను విమర్శి ంచారు. ఇది సరైన పద్ధతి కాదని, పుతిన్‌ తనను నిరాశపరిచారన్నారు. చర్చలపై ఆసక్తి లేదని ట్రంప్‌ చెప్పా రు. అయితే రష్యాకు ఇచ్చిన గడువు తగ్గించడాన్ని ఉక్రెయిన్‌ అధికారి ఆండ్రీ యర్మాక్‌ స్వాగతించారు. ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో చైనాకు... అమెరికా అధ్యక్షుడు త్వరలో చైనాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్రూత్‌ మాధ్యమ ంగా తెలిపారు. వాస్తవానికి చైనాకు వెళ్లే ఆసక్తి లేదన్నారు. అయితే ఆ దేశాధ్యక్షుడి ఆహ్వానం మేరకు వెళ్లాల ని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశాన్ని తాను కోరుకోవడం లేదన్నారు. ‘పిలి చారు కాబట్టే వెళ్లాలని అనుకుంటున్నా తప్ప పెద్దగా ఆసక్తి ఏమీ లేదు’ అని ‘ట్రూత్‌’లో ట్రంప్‌ పేర్కొన్నారు. కిమ్‌తో అణు చర్చలకు ఓకే... అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేం దుకు ఉత్తర కొరియాతో చర్చకు అమె రికా సిద్ధమైంది. ఆదేశాధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో ఈ మేరకు చర్చలు జరిపేందుకు తమ అధ్యక్షుడు ట్రంప్‌ సానుకూలంగా ఉన్నట్లు శ్వేతసౌధం అధికారి తెలిపారు. అయితే అణు కార్యక్రమాన్ని ఆపే ఉద్దేశం తమకు ఏ మాత్రం లేదని ఉత్తర కొరియా ఇప్పటికే స్పష్టంచేసింది. ఇది పబ్లిసిటీ స్టంట్‌... పలస్తీనాఇజ్రాయిల్‌ సమస్యకు ఐక్య రాజ్య సమితి టూ`స్టేట్‌ సొల్యూషన్‌ సదస్సు ఓ పబ్లిసిటీ స్టంట్‌ అని అమెరికా విమర్శించింది. ఘర్షణ ముగింపుకు సున్నితమైన దౌత్య చర్యల నడుమ ఈ పరిణామం కేవలం ప్రచారం కోసమే అని అమె రికా అధికారి టామీ బ్రూస్‌ పేర్కొ న్నారు. ఈ సదస్సు శాంతిని ప్రోత్సహి ంచబోదని, యుద్ధాన్ని మరింత పొడిగిస్తుందని అభిప్రాయపడ్డారు. హమాస్‌కు ధైర్యం ఇస్తుందన్నారు. శాంతి సాధన కోసం జరిగే వాస్తవ కసరత్తులను నీరుగారుస్తుందని, వాటికి తీవ్రంగా ఆటంకం కలిగిస్తుందని బ్రూస్‌ వెల్లడిరచారు. ఇదిలావుంటే, గాజాలో ఇజ్రాయిల్‌ దాడుల నేపథ్యంలో అక్కడ మానవతా సంక్షోభం తీవ్రరూపం దాల్చడంపై ట్రంప్‌ స్పందించారు. గాజా ప్రజలు ఆకలితో అలమటిస్తుండటంతో మరిన్ని ఆహార కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రెండేళ్లుగా సాగుతున్న పోరులో దాదాపు 60వేల మంది చనిపోయారు. ప్రస్తుతం ఆకలి చావులు సంభవిస్తున్నాయి. అయితే గాజాలో పస్తులుండే పరిస్థితి లేదని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు బలంగా వాదించారు. హమాస్‌ను అంతం చేసే వరకు పలస్తీనాపై దాడులు ఆగవని ఆయన మరోమారు తేల్చిచెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు