బీజింగ్ జలమయం: 34 మంది మృతి
బీజింగ్ : చైనాను భారీ వరదలు ముంచెత్తాయి. బీజింగ్‌లో 34 మంది చనిపోయారు. 80 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మియున్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ 28 మంది, యాంకింగ్ జిల్లాలో మరో ఇద్దరు మరణించారు. హెబీ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మియున్‌కు చెందినవారే 17వేల మంది సహా దాదాపు 80వేల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.లువాన్‌పింగ్ కౌంటీలోని గ్రామీణ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా కొందరు చిక్కుకుపోయారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో దిగువ ప్రాంతాల ను అధికారులు ఖాళీ చేయించారు. భారీ వర్షాల కారణంగా చెట్లు నేలకూలాయి. విద్యుత్తు స్తంభాలు దెబ్బతిని అనేక ప్రాంతాలు అంథకారంలో చిక్కుకున్నాయి. హెబీలోని లువాన్‌పింగ్ కౌంటీ సరిహద్దుల్లో చాలా కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ మేరకు జరిగిన నష్టంపై చైనా ప్రధానమంత్రి లి క్వియాంగ్ ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రాణ నష్టం నివారించాలని ఆదేశాలిచ్చారు.
చైనాలో వరద బీభత్సం
- Advertisement -
RELATED ARTICLES


