వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాలా మంచివారని ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్ ప్రశంసించారు. అలాంటి వ్యక్తిపై మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని వ్యాఖ్యానించారు. రష్యాలో నిర్వహించిన ఫోరం ఆఫ్ ది ఫ్యూచర్`2050లో ఆయన మాట్లాడుతూ పుతిన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘పుతిన్‌ది నిలకడ స్వభావం. ఆయన మంచి వారు. పాశ్చాత్య మీడియా ఆయనతో పాటు రష్యాపై బురద జల్లుతోంది. శత్రుదేశంలా చిత్రీకరించేందుకు అవాస్తవ కథనాలు ప్రసారం చేస్తోంది. అవన్నీ నిరాధార వార్తలే’ అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, యూకే పార్లమెంట్ మాజీ సభ్యుడు జార్జ్ గల్లోవే, అమెరికా రేడియో హోస్ట్ అలెక్స్ జోన్స్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య విభేదాల నేపథ్యంలో ఎరాల్ మస్క్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడిరది.