Friday, January 23, 2026
Homeజిల్లాలునెల్లూరుప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయండి.. ఎంపిడిఓ

ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయండి.. ఎంపిడిఓ

- Advertisement -

విశాలాంధ్ర వలేటివారిపాలెం :సచివాలయం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేయాలని ఎంపిడిఓ నరేంద్ర దేవ్ అన్నారు.బుధవారం మండలంలోని సమీర్ పాలెం సచివాలయంను ఎంపిడిఓ నరేంద్ర దేవ్ ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు పట్టికను పలు రిజిస్టర్ లను పరిశీలించారు.సచివాలయం సిబ్బంది మొత్తం హాజరుకావడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది.ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సచివాలయంలో అందాల్చిన సేవలను మరింత విస్తృతం చేయాల్చిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాలని అన్నారు.సచివాలయం సిబ్బంది ప్రజలపట్ల బాధ్యతాయుతంగా వ్యవహారించాలని అన్నారు.ప్రజలకు సచివాలయం ద్వారా అందే సేవలలలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా చూడాలని ప్రజలకు సేవచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు