మత్తు పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు -గ్రామస్తులకు అవగాహన
విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : ప్రజల భద్రత,మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఆదేశాల మేరకు కందుకూరు డిఎస్ పీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కందుకూరు సీ ఐ అన్వర్ బాషా, గుడ్లూరు సీఐ నరేష్ కుమార్, వలేటివారిపాలెం ఎస్ ఐ మరిడి నాయుడు, లింగసముద్రం ఎస్ ఐ రాంబాబు, కందుకూరు టౌన్ ఎస్ ఐ శివనాగరాజు, కందుకూరు రూరల్ ఎస్ ఐ బాలకృష్ణ, పొన్నలూరు ఎస్ ఐ సత్యనారాయణ మరియు పోలీసు సిబ్బంది కలిసి వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వలేటివారిపాలెం బీసీ కాలనీ మరియు ఎస్ సీ కాలనీలో మరియు పరిసర ప్రాంతాల్లో ‘ఆపరేషన్ వజ్రా ప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ మంగళవారం తెల్లవారిజామున నిర్వహించారు.
తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్లు, దుకాణాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 35 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని, కొందరికి చలానాలు విధించారు. ఫింగర్ ప్రింట్ పరికరాలతో అనుమానితులను తనిఖీ చేశారు. రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. “డ్రగ్స్ వద్దు బ్రో”.. డ్రగ్స్ వద్దు -జీవితం ముద్దు అనే నినాదంతో ర్యాలీ నిర్వహించి, గంజాయి నిర్మూలనకు ప్రజలచేత ప్రతిజ్ఞ చేశారు.కందుకూరు డిఎస్పీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గంజాయి మరియు మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, ఉపాధి వంటి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని సూచించారు.గంజాయి వంటి మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.ఈ సందర్బంగా సీ ఐ లు అన్వర్ బాషా, నరేష్ కుమార్ లు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిత్యం నిఘా ఉంచామని వారు అన్నారు నేరాల నియంతనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. స్థానిక ఎస్ ఐ మరిడి నాయుడు మాట్లాడుతూ నేరాల నియంత్రనకి కార్టెన్ సెర్చ్ ను నిర్వహించామని అన్నారు ఈ ఆపరేషన్ లో సుమారు 200 ఇళ్లల్లో సోదాల నిర్వహించామని అన్నారు 35 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు రహదారి భద్రత సైబర్ నేరాల నివారణ పై అవగాహన కల్పించామని అన్నారు.అనంతరం బీసీ కాలనీ నుండి బస్టాండ్ సెంటర్ వరకు గ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు గ్రామస్తులతోమత్తు పదార్థాలు వినియోగించబమని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం ఏఎస్ ఐ బ్రాహ్మయ్య, రైటర్ ఏడుకొండలు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరాజు,స్టేషన్ పోలీస్ సిబ్బంది మరియు వివిధ పోలీస్ స్టేషన్ ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


