Homeజిల్లాలుఅనంతపురంగూగూడు దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పదవికి నియామకం..

గూగూడు దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పదవికి నియామకం..

- Advertisement -

నాయకులకు వనజాక్షి కృతజ్ఞతలు..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ) : గూగూడు గ్రామంలోని శ్రీ కుళ్ళాయిస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్‌గా తనను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్‌కు పొన్నతోట వనజాక్షి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి దేవస్థానం అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాస్, శింగనమల ఎమ్మెల్యే శ్రీమతి బండారు శ్రావణి, అనంతపురం పార్లమెంట్ సభ్యుడు శ్రీ అంబికా లక్ష్మీనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆలం నరసానాయుడు, నార్పల నాయకుడు ఆకుల ఆంజినేయులు, పార్టీ సీనియర్ నాయకుడు పొన్నతోట రమేష్ అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.
తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గూగూడు గ్రామ ప్రజల ఆశీర్వాదాలు, ప్రోత్సాహంతో ఈ బాధ్యత లభించిందని ఆమె తెలిపారు. దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిసి కృషి చేస్తానని వనజాక్షి పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, పార్టీ శ్రేణులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు