విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల పరిధిలోని గూగూడు గ్రామంలోని శ్రీ కుళ్ళాయి స్వామి దేవాలయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయ పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు మొత్తం 11 మంది సభ్యులను ట్రస్టీలుగా నియమించింది. దేవాలయ అర్చకుడు డి. హుస్సేనప్ప ఎక్స్-ఆఫీషియో సభ్యునిగా ట్రస్ట్ బోర్డులో కొనసాగనున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ట్రస్ట్ బోర్డు పదవీకాలం రెండు సంవత్సరాలుగా నిర్ణయించబడింది. ట్రస్టీల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ ఎన్నిక నిర్వహించి బాధ్యతలు అప్పగించనున్నారు. కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పాటుతో దేవాలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నాయని అధికారులు తెలిపారు.
ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఆర్. నాగార్జున, ఏ. నాగలక్ష్మి, మద్దినేని వెంకట నాయుడు, ఎం. సువర్ణ, జి. రామన్నమ్మ, పల్లా కుళ్ళాయి స్వామి, పి.ఓ. కుళ్ళాయమ్మ, పల్లె రాజన్న, పొన్నతోట వనజాక్షి, తుపాకుల సురేష్, జంగం అయ్యప్పలను ప్రభుత్వం నియమించింది.
గ్రామ ప్రజలు, భక్తులు కొత్త ట్రస్ట్ బోర్డుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవాలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ఉత్సవాల నిర్వహణలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. కొత్త కమిటీ ఆధ్వర్యంలో దేవాలయం మరింత అభివృద్ధి చెంది ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
గూగూడు శ్రీ కుళ్ళాయి స్వామి దేవాలయానికి కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పాటు…
- Advertisement -


