నేటి నుంచి జింబాబ్వేతో టీ 20 సిరీస్ ప్రారంభం
క్రీడలు: బయటి నుంచి వస్తున్న విమర్శలకు కుంగిపోకుండా ధైర్యంగా ఆడాలని భారత ఆటగాళ్లకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూచించాడు. టీమ్ఇండియా ఇటీవల ఇంగ్లాండ్, ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ల్లో పూర్తిగా ఓటమి పాలయ్యింది. దీంతో భారత జట్టుపై విమర్శల దాడి మొదలైంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా…జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. గురువారం (ఈ రోజు) నుంచి భారత్ ఆ జట్టుతో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. తొలి మ్యాచ్‌కు ముందు కెప్టెన్ శ్రేయస్ మీడియాతో మాట్లాడాడు. ‘ఇంగ్లాండ్ పర్యటనలో కొంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాం. దాని నుంచి చాలా సానుకూల అంశాలు నేర్చుకున్నాం. భవిష్యత్తులో ఒక జట్టుగా మేము ఏం చేయాలి, మైదానంలో అడుగుపెట్టి ఎలా ఆడాలనేదానిపై దృష్టి సారించాలని తెలుసుకున్నాం. మాలో కొందరు ఇక్కడ మొదటిసారి ఆడుతున్నారు. కాబట్టి మేం పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచి ఫలితాలను సాధిస్తాం. ఆటగాళ్లు వైఫల్యాల గురించి భయపడొద్దు. మీకు ఆ భయం లేనప్పుడు మీలోని అత్యుత్తమ ప్రతిభను బయటకు తీసుకొస్తారు’ అని శ్రేయస్ అయ్యర్ అన్నారు. ‘మనం వర్తమానంలో ఉండాలి. ఒక జట్టుగా కలిసికట్టుగా ఎంత మంచి క్రికెట్ ఆడితే అదే స్థాయిలో ఫలితం వస్తుంది. గత సిరీస్‌ల్లో ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు. కానీ, అది జట్టు సభ్యులను మరింత దగ్గర చేసింది. ఇకపై ఒక జట్టుగా ఎలా ఆడాలనే దానిపై చర్చలు జరుపుతున్నాం’ అని శ్రేయస్ వివరించాడు.
విమర్శలను పట్టించుకోకుండా ధైర్యంగా ఆడండి: శ్రేయస్ అయ్యర్
- Advertisement -


