Homeజాతీయంఅమెరికా వాణిజ్య ఒప్పందంపై నిరసనలు

అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిరసనలు

- Advertisement -

టోల్ ప్లాజాల వద్ద బైఠాయించిన రైతులు
పంజాబ్:
అమెరికా వాణిజ్య ఒప్పందంపై పంజాబ్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు మంగళవారం రైతులు చలో దిల్లీ కార్యక్రమం చేపట్టగా వారిని దిల్లీ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. అయినా రైతులు వెనక్కి తగ్గకుండా తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రతిపాదిత భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) వ్యతిరేకంగా ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్ కే ఎం ) అనుబంధ రైతులు బుధవారం పంజాబ్‌లోని పలు టోల్ప్లాజాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాలంటూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన ఎస్కేయమూ మధ్యాహ్నం 12 నుంచి మూడింటి వరకు టోల్ప్లాజాల వద్ద ఎటువంటి రసుం వసూళ్లు లేకుండా వాహనాలను వెళ్లనిచ్చారు. లూథిóయానా, బఠిండా, హోశియార్పుర్, అమృత్సర్ తదితర నగరాల టోల్ప్లాజాల వద్ద ఈ నిరసనలు కొనసాగాయి. అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం భారత సమాజంలోని రైతులు, పాడి ఉత్పత్తిదారులు, కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు, చిరు వ్యాపారులు తదితర వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. దేశంలోకి చౌకరకం సాగు దిగుమతులు పెరిగి, మన రైతుల రాబడులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే బలహీనంగా ఉన్న రైతుల ఆర్థిక పరిస్థితిని ఈ ఒప్పందం మరింత దిగజారుస్తుందని, కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతులకు హానికరంగా మారిన పంజాబ్ ప్రభుత్వ భూ సమీకరణ విధానాన్ని సైతం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికా నుంచి దిగుమతులు పెరిగితే దేశీయ వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతింటాయని ఆందోళనలు వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ ఉత్పత్తులకు, రైతులకు నష్టం కలిగించే ఈ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు