10 ఏళ్లలో 152 పరీక్షాపత్రాలు లీక్: రాహుల్ గాంధీ
న్యూదిల్లీ: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా గత పదేళ్లలో 152 పరీక్షాపత్రాలు లీక్ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్, అందుకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా కోరుతూ శాంతియుతంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులపై మోదీ ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయించిందని మండిపడ్డారు. విద్యపై రూ.1.4లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు కేంద్రం చెబుతోంది. కానీ, గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 152 పరీక్షల పత్రాలు లీక్ అయ్యాయని, దీని వల్ల 7.50కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. ఈ పేపర్ లీకేజీ ఘటనల్లో ఇప్పటివరకు శిక్షపడిన నేరస్థుల సంఖ్య సున్నా అని రాహుల్ విమర్శించారు. దేశంలోని యువత ఉద్యోగాలు లేక నిరాశ, నిసృÎహలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మన దేశంలో చైనా వస్తువుల సంఖ్య పెరిగింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. బ్యాంకులను బడా వ్యాపారులు లూటీ చేస్తున్నారు. ఏఐ వల్ల కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు పోతున్నాయి. కేంద్రం విధానాల వల్ల పేదలు, విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యార్థులంటే మనకు శత్రువులు కాదు. ఈ దేశ భవిష్యత్తు అన్న విషయం కేంద్రం గుర్తుంచుకోవాలి’ అని మండిపడ్డారు.
విద్యార్థుల డిమాండ్లు ఇవే…
లీకేజీకి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని యువత డిమాండ్ చేస్తోందని రాహుల్ చెప్పారు. ఆందోళన చేస్తోన్న యువతపై దాడి చేసిన వారికి శిక్ష పడాలని కోరుతోందని, ఈ వైఫల్యాలకు గానూ ప్రధాని క్షమాపణలు చెప్పాలని వారు కోరుతున్నారు. విద్యార్థుల డిమాండ్లకు తాము పూర్తి మద్దతు ఇసున్నామని వెల్లడించారు. పరీక్షల విధానంలో మార్పులు రావాలని, ప్రజల కోసం ఎన్ని దెబ్బలు తినేందుకైనా తాను సిద్ధం అని కాంగ్రెస్ ఎంపీ తెలిపారు. విద్యార్థుల ఆందోళనను తాము రాజకీయాలకు వాడుకోవట్లేదని, ప్రతిపక్ష నేతగా ప్రజల గళం వినిపించడం నా బాధ్యత అని రాహుల్ స్పష్టం చేశారు.
దేశంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం
- Advertisement -


