Homeజిల్లాలుఅనంతపురంఆన్‌లైన్ ట్రేడింగ్‌లో నష్టాలు.. అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య..

ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో నష్టాలు.. అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య..

- Advertisement -

విశాలాంధ్ర–డి.హీరేహళ్: అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండల కేంద్రానికి చెందిన కురుబ గౌరీ శంకర్ (27) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, గౌరీ శంకర్ స్థానిక సాయి బాలాజీ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు అలవాటు పడి, తెలిసిన వారి వద్ద అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ట్రేడింగ్‌లో భారీ నష్టాలు రావడంతో చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గురు ప్రసాద్ రెడ్డి తెలిపారు.లక్ష్మికి ఇద్దరు కుమారులు ఉండగా, మృతుడు చిన్న కుమారుడని, అతనికి ఇంకా వివాహం కాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు