విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాపై గొల్లపల్లి, మరూరు గ్రామపంచాయతీల్లో శనివారం
ప్రత్యేక గ్రామసభలను స్థానిక ప్రజలతో కలిసి నిర్వహించారు. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు-2026కు సంబంధించి
పంచాయతీల్లో ఓటర్ల జాబితా తయారీ, సవరణలు మరియు అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ గ్రామ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటరు జాబితాలోని తమ వివరాలను సరిచూసుకోవాలని, ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పీడీఓలు శైలజ, ముక్తేశ్వరి, వీఆర్ఓ సమర, సొసైటీ చైర్మన్ మరూరు గోపాల్, మేనకాదేవి, సంజీవరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ బ్రహ్మ, కదిరప్ప, నరేష్, డీలర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా పై ప్రత్యేక గ్రామసభ
- Advertisement -


