Sunday, May 18, 2025
Homeవ్యాపారంపూణేలో అట్లాస్‌ కాప్కో గ్రూప్‌ అత్యాధునిక ఫెసిలిటీ ప్రారంభం

పూణేలో అట్లాస్‌ కాప్కో గ్రూప్‌ అత్యాధునిక ఫెసిలిటీ ప్రారంభం

పూణే: అట్లాస్‌ కాప్కో గ్రూప్‌, భారతదేశంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ, తలేగావ్‌లో కొత్త అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది సుమారు 270,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. కొత్త అత్యాధునిక ప్లాంట్‌ సీఎన్‌జీ (కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) బయోగ్యాస్‌, హైడ్రోజన్‌ కంప్రెషర్లు, ఎయిర్‌ డ్రైయర్లు, ఎన్‌2, ఓ2 జనరేటర్లు, మెడికల్‌ ఫిల్టర్లు, ఉపకరణాలతో సహా గాలి, గ్యాస్‌ కంప్రెషర్లు, వ్యవస్థలను తయారు చేస్తుంది. 2023లో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌, పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు, అధునాతన సాంకేతికతతో సమకూర్చబడిరది. దీని ద్వారా, భారతదేశ గాలి, గ్యాస్‌ కంప్రెషర్‌ మార్కెట్‌ లో అట్లాస్‌ కాప్కో తన స్థానాన్ని మరింతగా బలోపేతం చేయనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు