విశాలాంధ్ర` తొర్రూర్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల అభివృద్ధి సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి లు అన్నారు. బుధవారం తొర్రూర్ మున్సిపాలిటీలోని 14వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి సోమ రజనీ రాజశేఖర్ గెలుపు కొరకు ఎమ్మెల్యే ప్రతి ఇంటిని సందర్శించి చేతి గుర్తుకు ఓటు వేసి సోమ రజనీ రాజశేఖర్‌లను గెలిపించాలని కోరారు. అనంతరం కార్నర్ మీటింగులో ఎమ్మెల్యే యశస్విరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చారన్నారు. ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డ్స్ ,సన్న బియ్యం, మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకుఉచిత బస్సు, 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రైతు భరోసా, రైతు పంటకు 500 బోనస్ తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పదో వార్డ్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ముద్దసాని సురేష్ గెలుపు కొరకు ఇల్లు తిరిగి చేతి గుర్తుకు ఓటు వేసి ముద్దసాని సురేష్ గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్నర్ మీటింగ్లో ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ ముద్దసాని సురేష్ తల్లి వార్డు అభివృద్ధికి కృషి చేశారని అలాగే ఆమె కుమారుడు కూడా ప్రజల అభివృద్ధి తన సంక్షేమమే పనిచేస్తున్నాడని, అలాంటి సురేష్ కు ఓటు వేసి అత్యధికంగా గెలిపించాలన్నారు.. వార్డులలో సరియైన రోడ్లు ,సైడ్ కాలువలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాటన్నిటిని ఎలక్షన్ అనంతరం ఎమ్మెల్యే యశస్వి రెడ్డి తో కలిసి చేపిస్తానని అన్నారు. గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన జీవోలను వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపివేసి, అభివృద్ధికి అడ్డం పడుతున్నారని చెపుతున్న బి.ఆర్.ఎస్ నాయకులు మీరు విడుదల చేసిన జీవోలను దమ్ముంటే బయటపెట్టాలన్నారు. తొరూరు పట్టణములో 16 వార్డులకు 16 గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. మంత్రి శ్రీనివాసరెడ్డి తోరూర్ మున్సిపల్ పట్టణాన్ని దత్తత తీసుకున్నాడని వారి సహాయ సహకారాలతో అత్యధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ ,మాజీ వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే
- Advertisement -
RELATED ARTICLES


