న్యూదిల్లీ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను ఏప్రిల్ 7న జరుపుకుంటున్న వేళ, మంచి ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారం తీసుకోవాలని ఆహార నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా బాదంపప్పు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజువారీ భోజనంలో చేర్చడం అతి సులభం. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాదంపప్పు అయిన కాలిఫోర్నియా బాదంపప్పులు ప్రోటీన్, డైటరీ ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, జింక్, విటమిన్‌ఈ వంటి 15 ముఖ్యమైన పోషకాల సహజ వనరు, ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలికి తెలివైన జోడిరపుగా ఉంటాయి. దాదాపు 200 కంటే ఎక్కువ పరిశోధన అధ్యయనాల ప్రకారం, శక్తి, రోగనిరోధక శక్తిని అందించడం నుండి మెరుగైన గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర స్థాయిలు, బరువు నిర్వహణ వరకు బాదం ఆరోగ్య ప్రయోజనాలను వెల్లడిరచాయి. బాదంపప్పులోని ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్
ఈ మెరిసే చర్మానికి, వృద్ధాప్య వ్యతిరేక ప్రయోజనాలకు దోహదం చేస్తాయి.