విశాలాంధ్ర – నేరేడుచర్ల : అసెంబ్లీలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేసినందుకు బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు, నేరేడుచర్ల మండల పరిధిలో నియోజకవర్గ బిఆర్‌ఎస్ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి ఆదేశానుసారం బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్‌బాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు శుక్రవారం భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. అనంతరం సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఏక పక్షంగా జగదీష్ రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుండి సస్పెండ్ చేయటం దుర్మార్గమని, వీరి చేతగాని తనాన్ని, ఆరు హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తారని ఇలా బిఆర్‌ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, చేతనైతే పాలనలో సత్తా చూపించి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని, అంతే తప్ప ఇలా ప్రశ్నించే గొంతుకుల సస్పెండ్ చేయడం అన్యాయమని దుయపట్టారు. ఇలాగే బిఆర్‌ఎస్ పార్టీపై ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడితే మున్ముందు పెద్ద ఎత్తున ఉద్యమ తరహాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించారు. బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.