ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, ఇందులో భాగంగా ధర్మవరం డివిజన్ పరిధిలోని పేద విద్యార్థులకు దాదాపు 45 ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతికి ప్రవేశం కల్పించడం జరుగుతున్నదని ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ డీఈవో కృష్ణప్ప ఆదేశాల మేరకు ఇందులో భాగంగా మే నెల రెండవ తేదీ నుండి మే నెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవలసినదిగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు వారు తెలిపారు. దరఖాస్తులను ఆయా సచివాలయాలలో గాని వెబ్సైట్లో గాని చేసుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. లాటరీ విధానములో తొలి విడత ఫలితాలను మే 29వ తేదీ విడుదల చేస్తారని, సీట్లు సాధించిన విద్యార్థులను జూన్ 8వ తేదీన ఖరారు చేస్తారని తెలిపారు. అదేవిధంగా రెండో విడత ఫలితాలను జూన్ 11వ తేదీన విడుదల చేసి షీట్లు సాధించిన విద్యార్థులను జూన్ 18వ తేదీ ఖరారు చేస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1800425899 కు సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి..
RELATED ARTICLES