Sunday, June 15, 2025
Homeజిల్లాలుకర్నూలుఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు ప్రిన్సిపాల్ రంగన్న తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాఠశాలలో 6వ తరగతికి 100 సీట్లకు గాను 271 మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకోగా 265 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. అందులో 130 మందిని రోస్టర్ ఆధారంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షలో ఉమ్మిసలియా 74,మేఘన 70, సాయి ఈశ్వర్ 66 మార్కులతో టాపర్లుగా నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు