Homeజిల్లాలుకర్నూలురైతుల భూ సమస్యలు పరిష్కరించాలి

రైతుల భూ సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : రైతుల భూ సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం పెద్దకడబూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర, కమిటీ సభ్యులు రాజు మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించకుండా తహసీల్దార్ రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలోని సర్వే నెంబర్ 6/2దీ, 514 భూ సమస్యలపై గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి 8 నెలలు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం చూడకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్ సీలింగ్ భూములు హక్కు దారులు రికార్డు పరంగా ఎవరు ఉన్నారో వారికే భూములు చెందాలన్నారు. అలా కాకుండా వేరే వాళ్ళు పొలంలో ఉన్నారంటే వీఆర్వోలు ఆక్రమణ దారుల నుంచి డబ్బులు తీసుకుని అక్రమంగా ఆన్లైన్, అడంగల్ లో పేర్లు నమోదు చేసుకుని సాగు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆర్ఐ జెర్మియాను అడిగితే రికార్డు పరంగా రిపోర్ట్ రాస్తాను అంటున్నారని తెలిపారు.రికార్డులో హక్కుదారులు ఎవరు ఉన్నారో వారికే భూములు ఇవ్వాలని కోరారు. అలాగే నాగలాపురం గ్రామంలో సర్వే నెంబర్ 318 లో గత 30 సంవత్సరాలుగా 12 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆ స్థలాలపై ప్రభుత్వ నిబంధనలు ఎత్తివేసి కుటుంబాలకు న్యాయం చేయాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆ స్థలంలోనే టెంటు వేసుకొని రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ నాయకులు నాగేష్, గోపాల్, బుడ్డమ్మ, మల్లమ్మ, గూనయ్య, తిక్కన్న, హరికృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు