Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

- Advertisement -

లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకులేటి రమేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆకులేటి రమేష్ బాబు, కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి వెంకటేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి శాస్త్ర చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో 85 మంది కంటి రోగులు హాజరు కావడం జరిగిందని వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించగా 65 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. వీరందరికీ లైన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు బద్దల వెంకటరామయ్య, కీర్తిశేషులు బద్దెల బాలమ్మ, కీర్తిశేషులు బీవీ రత్నయ్య, కీర్తిశేషులు బి వరలక్ష్మి వారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు నిర్వహించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సీనియర్ ,జూనియర్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు