శ్రీ సత్య సాయి జిల్లా హాకీ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్
విశాలాంధ్ర – ధర్మవరం : హాకీ క్రీడల్లో శ్రీ సత్యసాయి జిల్లా హాకీ పురుషుల, బాలిక జట్టు ఫైనల్ కు దూసుకెళ్లిందని శ్రీ సత్యసాయి జిల్లా హాకీ ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో జరుగుతున్న అమరావతి హాకీ పోటీలలో పురుషుల హాకీ,, బాలికల హాకీ జట్లు ఫైనల్ కు దూసుకెల్లడం జరిగిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పురుషుల జట్టు మొదటి మ్యాచ్లో ఏలూరు జిల్లా జట్టు పై 2-0 గోల్స్,రెండవ మ్యాచ్లో తిరుపతి జిల్లా జట్టు పై 2-1గోల్స్,క్వార్టర్ ఫైనల్ లో అనంతపురం జిల్లా జట్టుపై 4-0 గోల్స్ సెమీ ఫైనల్ లో వెస్ట్ గోదావరి జిల్లా జట్టుపై 2-1 గోల్స్ తో విజయం సాధించి ఫైనల్ కి వెళ్ళింది అని తెలిపారు. బాలికల జట్టు మొదటి మ్యాచ్లో చిత్తూరు జిల్లా జట్టుపై 10-0, గోల్స్ రెండో మ్యాచ్ లో ఎన్టీఆర్ జిల్లా జట్టుపై 5-0 గోల్స్ ,క్వార్టర్ ఫైనల్ మ్యాచులో అన్నమయ్య జిల్లా జట్టుపై 2-0.గోల్స్ సెమీఫైనల్ లో అనంతపురం జిల్లా జట్టుపై షూట్ అవుట్ లో 3-1గోల్స్ తో విజయం సాధించి ఫైనల్ కు వెళ్ళింది అని తెలిపారు.విజయం సాధించిన జిల్లా జట్లను సత్య సాయి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్, హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బి. సూర్య ప్రకాష్, సత్య సాయి జిల్లా హాకీ కోచి్ హస్సేన్ అభినందించారు.
ఫైనల్ కు దూసుకెళ్లిన శ్రీ సత్య సాయి జిల్లాహాకీ పురుషుల, బాలికల జట్టు
- Advertisement -
RELATED ARTICLES


