విశాలాంధ్ర – ధర్మవరం : ఏపీ జూనియర్ సైకిల్ పోలో బాలికల విభాగంలో పట్టణంలోని యశోద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ద్వితీయ స్థానం సాధించిందని కరెస్పాండెంట్ మల్లికార్జున, ప్రిన్సిపాల్ అనూప్ కుమార్, డైరెక్టర్ పృధ్విరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించడం పాఠశాలకు గర్వంగా ఉందని తెలిపారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ సాయి జూనియర్ సైకిల్ పోలో బాలికల బాలుర పోటీల్లో పాఠశాల బాలికల జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నదని ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థినీల క్రీడా ప్రతిభను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. ప్రతిభ ఘనపరిచిన విష్ణువర్ధన్ రెడ్డి నైన్త్ క్లాస్, గగన సింధు 9వ తరగతి, యశ్మిత రాణి ఎనిమిదో తరగతి, తృతీయ కృష్ణ ఏడవ తరగతి, హ్యాషిత ఎనిమిదో తరగతి, మోక్షిత ఏడవ తరగతి లను అభినందిస్తూ క్రీడలతో పాటు విద్యలోనూ రాణించాలని వారు ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో పాఠశాల విద్యార్థుల విజయాలు సాధించేలా ప్రోత్సహిస్తామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
సైకిల్ పోలో బాలికల విభాగంలో ద్వితీయ స్థానం
- Advertisement -
RELATED ARTICLES


