న్యూదిల్లీ: 4 కోట్లకు పైగా వినియోగదారులతో భారతదేశం లోనే అతి పెద్ద కనెక్టెడ్ కన్స్యూమర్ ఎకో సిస్టమ్ ను నిర్మించింది బోల్ట్. అలాంటి ఫైర్ బోల్ట్ ఇప్పుడు… ‘బోల్ట్’ అనే కొత్త మేడ్-ఇన్-ఇండియా స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌ను ప్రారంభిస్తోంది. దీనిద్వారా స్మార్ట్ ఫోన్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బ్రాండ్ ఫ్లిప్‌కార్ట్, ఇతర పంపిణీ మార్గాలలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. వేరబుల్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఫైర్-బోల్ట్, ఒక విస్తృత కన్స్యూమర్ టెక్నాలజీ కంపెనీగా పరిణామం చెందడంలో ఈ చర్య ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఏళ్ల తరబడి వినియోగదారులకు కావాల్సిన ఉత్పత్తుల్ని అందిస్తూ వారికి అవసరమైన వస్తువుల వ్యవస్థను గుర్తించింది. తద్వారా ఆయా విభాగాలలోని నైపుణ్యాన్ని ఉపయోగించుకుని, ఈ బ్రాండ్ ఇప్పుడు తన ‘కస్ట్ మర్ ఫస్ట్ అనే విధానాన్ని స్మార్ట్ ఫోన్ల విభాగంలోకి తీసుకువస్తోంది. ఈ విభాగం రోజువారీ డిజిటల్ అనుభవాలకు కేంద్ర బిందువుగా ఉంది. భారతదేశంలోనే తయారు చేయబడి, భారతీయ వినియోగదారుల కోసం రూపొందించబడిన బోల్ట్, స్థానిక తయారీ పట్ల ఫైర్-బోల్ట్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో, మార్కెట్‌పై దానికున్న లోతైన అవగాహనను ఫ్లిప్ కార్ట్ విస్తృతమైన వ్యాప్తితో మేళవించి, దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తన స్మార్ట్ ఫోన్ పోర్ట్ ఫోలియోను అందిస్తోంది.


