Homeతెలంగాణబీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం

బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం

- Advertisement -

. పదేళ్లలో బీఆరఎస్… పన్నెండేళ్లల్లో మోదీ ఏం చేశారో చర్చిద్దాం రండి
. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలవనీయం
. కరీంనగర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఖాయం: రేవంత్

విశాలాంధ్ర – హైదరాబాద్: బీజేపీ, బీఆరఎస్‌ది ఫెవికాల్ బంధమని, అందుకే పార్లమెంటు ఎన్నికల్లో బీఆరఎస్ అవయవ దానం చేసి బీజేపీని ఎనిమిది స్థానాల్లో గెలిపించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు. ఇది జరిగి ఆరు నెలలైనా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదన్నారు. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంగా మారిందన్న ప్రధాని ఎందుకు సీబీఐ విచారణ చేపట్టలేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో గురువారం “ప్రజా పాలన- ప్రగతి బాట” కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామని కరీంనగర్ గడ్డపై నుంచి సోనియా గాంధీ మాట ఇచ్చారని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సర్వం కోల్పోయినా… ఇచ్చిన మాట ప్రకారం ఆమె తెలంగాణ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పదేళ్లు అందివచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆరఎస్ నాయకులు రూ.వేల కోట్లు సంపాదించుకున్నారు తప్ప ప్రజలకు చేసిందేం లేదని ఆరోపించారు. కనీసం పేదలకు డబుల్ బెడ్రూమ్‌లు కూడా ఇవ్వలేదని, కానీ ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. రైతులకు ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని,రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. సన్నబియ్యం, ఆర్టీసీలో మహిళలకు ఉచితసౌకర్యం అందించామన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ… మీ జాతీయ నాయకులందరినీ తీసుకురండి, మా కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీజేపీని గెలవనీయరని అన్నారు. గతంలో పాలమూరు వచ్చిన ప్రధాని మోదీ… పాలమూరు రంగారెడ్డిని జాతీయ

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు