Wednesday, April 2, 2025
Homeవిశ్లేషణబ్యాంకుల్లో సిబ్బంది కొరత

బ్యాంకుల్లో సిబ్బంది కొరత

సీహెచ్‌ వెంకటాచలం
సిబ్బంది కొరతతో బ్యాంకులు కొట్టుమిట్టాడుతున్నాయి. గత పదేళ్లుగా చూసుకుంటే అధికారులు మినహా క్లర్క్‌లు, సబ్‌ స్టాఫ్‌ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత నెల 10వ తేదీ లోక్‌సభలో సీపీఐ సభ్యుడు వి సెల్వరాజ్‌ అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి సమాధానం ఇస్తూ బ్యాంకులలో సిబ్బంది కొరతలేదనీ, 95 శాతం సిబ్బంది పనిచేస్తున్నారని అసత్యాలు చెప్పారు. వాస్తవానికి ప్రభుత్వరంగ బ్యాంకుల శాఖలలో క్లర్కులు, సబ్‌స్టాఫ్‌ తదితర పోస్టులు చాలా ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి. ఖాళీలను భర్తీ చేయాలని ఏఐబీఈఏ (అఖిల భారత ఎంప్లాయీస్‌ యూనియన్‌) సంవత్సరాలుగా డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకున్న నాధుడులేడు. ఖాళీల భర్తీతో పాటు, ఇతర సమస్యల పరిష్కారానికి బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదు. పైపెచ్చు 95 శాతం సిబ్బందిని భర్తీ చేశామని లోక్‌సభ సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి అబద్దాలు చెపుతున్నారు. బ్యాంకుల్లో క్లర్కుల సిబ్బందిని చేర్చుకోవడం తగ్గించినట్టు అన్ని శాఖల్లో పనిచేసే వారందరికీ తెలుసు. అంతేకాదు సబ్‌స్టాఫ్‌ను, పార్ట్‌టైం ఉద్యోగులను చేర్చుకోవడంపై నిషేధం విధించారు. అంతేకాదు ముఖాముఖంగా ఇచ్చే ఆదేశాల మీద కూడా రిక్రూట్‌ చేసుకోవడం లేదు. ఈ కారణాలన్నింటి వల్ల ఆయా శాఖలలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. ఫలితంగా తక్కువగా ఉన్న సిబ్బంది రోజువారీ పనిని పూర్తిచేయలేకపోతున్నారు. పర్యవసానంగా చాలా శాఖల్లో తాత్కాలిక, క్యాజువల్‌ సిబ్బందిని చేర్చుకొని పనిచేయించుకుంటున్నారు. 95 శాతం సిబ్బందిని చేర్చుకున్నామని మంత్రి పంకజ్‌ చౌదరి చెప్పిన సమాధానం కేవలం అబద్ధమే.
మంత్రి సమాధానం మేరకు 20112024 మధ్యకాలంలో 1,72,980 అధికారులు అదనంగా వచ్చి చేరగా, క్లర్కుల సంఖ్య 5,693, సబ్‌స్టాఫ్‌ సంఖ్య 29,410 తగ్గిపోయింది. బ్యాంకు ఉద్యోగుల సంఖ్యకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) విడుదల చేసిన వివరాలిలా ఉన్నాయి. 20112012ల్లో క్లర్కుల రిక్రూట్‌మెంట్‌తో పోల్చినప్పుడు, 20132024లో క్లర్కుల సిబ్బంది 20132024 సంవత్సరాలలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది.
క్లర్కుల సంఖ్య 2013 నాటికి 3,98,801
క్లర్కుల సంఖ్యా బలం 2024 నాటికి 2,46,965
తగ్గుదల 1,51,836
ఈ సంఖ్యలను పరిశీలించినప్పుడు 1,50,000 క్లర్కుల పోస్టులు, దాదాపు 50,000 సబ్‌స్టాఫ్‌ (దాదాపు 2 లక్షల ఖాళీలు) ప్రభుత్వరంగ బ్యాంకులలో ఖాళీలు ఉన్నాయి. వాణిజ్యం వృద్ధిపరిచేందుకు, వివిధ ప్రభుత్వ పథకాలు పెంపొందించాలంటే మరింత మంది అవసరమవుతారు. అందువల్లనే ఉద్యోగులు పనిభారంతో ఇబ్బంది పడుతున్నారు. మరో పక్క ప్రైవేటు బ్యాంకులలో సిబ్బంది ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయడంతో పాటు సిబ్బంది సంఖ్యను పెంచుతున్నారు. ప్రైవేట్‌ బ్యాంకులలో 2011లో 1,71,071సిబ్బంది ఉండగా, ఆ సంఖ్య 2024లో 8,46,530కి చేరింది. క్లర్కులు, వాస్తవ పరిస్థితులు ఇలావుండగా, సబ్‌స్టాఫ్‌ సిబ్బంది 95 శాతం రిక్రూట్‌ చేసినట్టుగా మంత్రి ఎలా చెప్పారో తెలియదు. ఇది అంకెల పొరపాటా లేక కావాలని తప్పుడు సమాచారం ఇచ్చారా? ఏదైనా కానివ్వండి. వివిధ శాఖలలో సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉందని మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని, డిమాండ్‌ చేయాలని ఏఐబీఈఏ మార్చి 24, 25 తేదీలలో జాతీయ స్థాయి సమ్మెకు పిలుపునిచ్చింది. సిబ్బంది మొత్తం ఈ సమ్మెలో పాల్గొనాలని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
` ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు