న్యూదిల్లీ: భారత్‌పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణలో ‘ఎస్
400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్’ కీలకపాత్ర పోషించింది. ఆపరేషన్ సిందూర్ విజయానికి కారణమైంది. పాక్ డ్రోన్లు, క్షిపణులను క్షణాల్లో నేలకూల్చింది. దీనిని సుదర్శన చక్రంగా భారతీయులు వర్ణిస్తారు. ఈ అద్భుత అస్త్రాన్ని రష్యా నుంచి తెప్పించుకున్న భారత్… తాజాగా మరిన్ని సమకూర్చుకొని తమ వైమానిక రక్షణ సామర్థాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం అదనంగా ఎస్400 రక్షణ వ్యవస్థలను రష్యా నుంచి తెప్పించబోతోంది. ఈ మేరకు రష్యాకు వినతి పంపినట్లు అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి. దీనికి రష్యా కూడా అంగీకరించినట్లు వెల్లడిరచాయి. ప్రపంచ ఆధునిక అస్త్రాల్లో ఒకటిగా రష్యా తయారీ ‘ఎస్
400’ ఉంది. 600 కిమీల దూరంలో లక్ష్యాలను గుర్తించడం, 400 కిమీల దూరంలో వాటిని ఛేదించడం దీని ప్రత్యేకత. ఏకకాలంలో నాలుగు రకాల క్షిపణులు ప్రయోగించగలదు.
విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేయగలదు. 100 లక్ష్యాలను ఒకేసారి గుర్తించగలదు. 2018లో ఐదు ఎస్`400 రక్షణ వ్యవస్థల కోసం రష్యాతో 5.43 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఈ అస్త్రం 2021లో భారత అమ్ములపొదికి చేరింది.