పాక్ దుస్సాహసం
. డ్రోన్లు, క్షిపణులు, యుద్ధవిమానాలతో దాడి
. తిప్పికొట్టిన భారత బలగాలు
. మూడు యుద్ధ విమానాలు, 12 డ్రోన్లు కూల్చివేత
. గడప దాటొద్దని ప్రజలకు హెచ్చరికలు
. జమ్మూ, కుప్వారా, పూంచ్‌లో సైరన్ల మోత
. 8 పాకిస్థానీ క్షిపణులను ఎస్`400 వ్యవస్థతో ధ్వంసం
న్యూదిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత్ మెరుపు దాడులతో బిక్కచచ్చిన పాకిస్థాన్… తన ఉనికి చాటుకొనేందుకు ప్రయత్నిస్తోంది. జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడిరది. జమ్మూ విమానాశ్రయం సమీపంలో పాకిస్థాన్ ఆత్మాహుతి డ్రోన్ దాడులకు పాల్పడిరది. సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం పాక్ దాడుల్ని తిప్పికొట్టింది. జమ్మూ, పంజాబ్ మొత్తం బ్లాకౌట్ కాగా రాజస్థాన్‌లోని కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అఖ్నూర్, కిష్ట్వార్, సాంబా సెక్టార్‌లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాక్ దుస్సాహసానికి పాల్పడిరది. డ్రోన్లు, రాకెట్లు, యుద్ధవిమానాలతో దాడులకు దిగింది. పాక్ ప్రయోగించిన దాదాపు 12 డ్రోన్లు, ఎనిమిది క్షిపణులను ఎస్400 వ్యవస్థ ద్వారా భారత సాయుధ దళాలు ధ్వంసం చేశాయి. పాక్ ఉపయోగించిన రెండు జేఎఫ్
17, ఒక ఎఫ్`16 యుద్ధ విమానాలను, ప్రొఖ్రాన్ వద్ద క్షిపణిని పేల్చివేశాయి. అయితే ఆకస్మికంగా జరిగిన దాడితో జమ్మూకశ్మీర్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్లపై ఉన్న వారంతా ఆందోళనతో పరుగులు తీశారు. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లో హై అలర్డ్ ప్రకటించారు. ఆయా ప్రాంతాల గగనతలంలో పాక్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడగా భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. కాగా, పాక్ దాడులతో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ సహా ఏడుచోట్ల భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దాడుల వేళ జమ్మూకశ్మీర్ పూర్తిగా అంధకారమైంది. జమ్మూ, కుప్వారా, పూంచ్‌లో సైరన్లు మోగాయి. జమ్మూ విమానాశ్రయంపై రాకెట్ దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. శ్రీనగర్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్ వైమానిక దళం ప్రధాన కార్యాలయాన్ని పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకుంది. జైసల్మేర్ వద్ద డ్రోన్లను భారత సైన్యం గాల్లో పేల్చివేసింది. జమ్మూ వర్సిటీ వద్ద రెండు డ్రోన్లను కూల్చివేసింది. జమ్మూ, కుప్వారా, పఠాన్‌కోట్ సహా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ డివిజన్‌లోని సాంబాతో పాటు అఖ్నూర్, రైసీ, రాజౌరీ, కిష్ట్వార్‌లో భారీగా కాల్పులు, ఫిరంగి దాడులు జరిగాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం ఆదేశించింది. సెల్‌ఫోన్ సేవలు నిలిపివేసింది. యూఏవీ (మానవరహిత ఏరియల్ వెహికల్స్)లతో పాక్ దాడి చేస్తుండగా… భద్రతా దళాలు ప్రతిఘటిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడిరచాయి. అత్యాధునిక సాంకేతికతతో డ్రోన్లను గాల్లో ధ్వంసం చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు అందలేదు. ‘జమ్మూ పూర్తిగా అంధకారమైంది. అంతటా భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. బాంబులు, ఫిరంగులు, క్షిపణులతో పాకిస్థాన్ దాడులు చేస్తోంది. భారత సైన్యం వీటిని సమర్థంగా తిప్పికొట్టగలదు’ అని జమ్మూకశ్మీర్ డీజీపీ శేష్‌పాల్ వైద్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘జమ్మూలోని మా ఇళ్ల మీదకు క్షిపణులు దూసుకొస్తున్నాయి. పౌరుల జీవితాలకు ముప్పు ఏర్పడిరది. మాకు రక్షణ లేదు. ఇదంతా నిజంగా జరుగుతోంది. జమ్మూ మొత్తం బ్లాకౌట్ అయింది’ అంటూ ఓ స్థానికుడు ఎక్స్ మాధ్యమంగా ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ భయాందోళనకు గురయ్యాడు.