Thursday, November 21, 2024
Homeతెలంగాణమాది ఇందిరమ్మ రాజ్యం

మాది ఇందిరమ్మ రాజ్యం

. మీలా రైతుల భూములు గుంజుకోబోం
. భూ బాధితుల గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు: భట్టి

విశాలాంధ్ర-హైదరాబాద్‌: కాంగ్రెస్‌ గతంలో రైతులకు ఇచ్చిన భూములను బీఆర్‌ఎస్‌ హయాంలో గుంజుకు న్నారని, వాటికి లేఅవుట్‌లు వేసి అమ్ముకున్నారని, దీంతో అన్నదాతల గురించి మాట్లాడే అర్హతను గత పాలకులు కోల్పోయారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తితో, ఆమె ఆశయాలు, ఆలోచనలు ప్రకారం తమ ప్రభుత్వం ముందుకెళుతున్నట్లు తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌, నెక్లెస్‌ రోడ్డులోని పీవీ మార్గ్‌ వద్ద ఆమె విగ్రహానికి పుష్కాంజలి ఘటించారు. అనంతరం పీసీసీ మహేశ్‌ గౌడ్‌ అధ్వర్యంలో గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేళి నివాళులర్పించారు. ఆపై విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. 24 అక్షల ఎకరాల అసైన్డ్‌ భూముల్లో 10వేల ఎకరాలను బీఆర్‌ఎస్‌ అన్యాక్రాంతం చేసిందని ఆరోపించారు. భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి భూములను రాష్ట్రాభివృద్ధి ఉద్దేశంతోనే తీసుకుంటాము తప్ప మీలా బలవంతంగా తీసుకోమని బీఆర్‌ఎస్‌ను భట్టి విమర్శించారు. లగచర్లలో అమాయక రైతులను రెచ్చగొట్టి అఇకారులపై దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు హింసను ప్రేరేపించి దాడులకు పురిగొల్పుతుంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని సీఎం రేవంత్‌ రెడ్డి కష్టపడుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దేశ ప్రజలను బీజేపీ మోసం చేసిందని… కాంగ్రెస్‌ కూడా తమ లాంటి పార్టీ అని భ్రమ పడుతోందన్నారు. దేశాన్ని అస్థిరపర్చాలని, విభజించాలని, తద్వార రాజకీయ లబ్ధి పొందాలనుకునే మీకు ఇందిరమ్మ రాజ్యం కోరుకునే మాతో పొలిక సరి కాదని భట్టి విక్రమార్క అన్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణాలర్పించిన ఇందిరా గాంధీ తెలిసినవాళ్లు, దేశంపై అభిమానం… చరిత్రపై అవగాహన ఉన్న వారు ఇందిరా గాంధీ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయలేరన్నారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఇందిరా గాంధీ మార్గాన్ని తమ ప్రభుత్వం అనుసరిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పిన విధనంగానే కులగణన నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ స్ఫూర్తితో ఈ సర్వేను శాస్త్రీయంగా చేస్తున్నామన్నారు. కుల గణన సర్వే ముగిసిన తర్వాత రాజకీయ `ఆర్థిక సామాజిక అంశాల్లో ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని, ప్రగతిశీల నిర్ణయాల ద్వారా దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలుపుతామని భట్టి అన్నారు. భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, 20 సూత్రాల అమలుతో సమ సమాజ నిర్మాణానికి ఇందిరాగాంధీ పునాదులు వేశారన్నారు. తన ప్రాణం కంటే కూడా ఈ దేశం ముఖ్యమని, దేశ సుస్థిరత కోసం చివరి రక్తపు బొట్టును కూడా ధారపోస్తానని చాటి చెప్పిన ఉక్కు మహిళ అంటూ కొనియాడారు. విదేశీ విధానంలో ఔన్యత్యాన్ని తెచ్చి భారత్‌ను గొప్ప దేశంగా నిలబెట్టిన ఆమె స్ఫూర్తిదాయకమని భట్టి శ్లాఘించారు. సమావేశంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఫిషరీస్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, నాయకులు శంకర్‌ నాయక్‌, చరణ్‌ యాదవ్‌, భూపతిరెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు