Homeమృత్యుంజయుడు

మృత్యుంజయుడు

- Advertisement -

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ పౌరుడు రమేశ్‌ విశ్వకుమార్‌ మృత్యుంజయుడిగా నిలిచారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 241 మంది ప్రయాణికుల్లో విశ్వకుమార్‌ ఒక్కరే ప్రాణాలతో ఉండటం ఓ అద్భుతం. ఆయన చూసిన వెంటనే విలేకరులు చుట్టుముట్టారు. విశ్వకుమార్‌ మాట్లాడుతూ ‘నేను లేచి పరిగెత్తా’ అని అన్నారు. ‘విమానం బయల్దేరిన 30 సెకన్లలో పెద్ద శబ్దం వినిపించింది. చుట్టూ మృతదేహాలు కనిపించాయి. చాలా భయమేసింది. లేచి పరిగెత్తా’ అని తన భయానక అనుభవాన్ని వర్ణించారు. విమానం ముక్తలు చల్లాచెదురుగా పడివుండటం చూసి వణికిపోయినట్లు తెలిపారు. తన సోదరుడు అజయ్‌ విశ్వకుమార్‌తో కలిసి విమానం ఎక్కానని, అతని జాడ లేదని విశ్వకుమార్‌ చెప్పారు. విశ్వకుమార్‌ను అధికారులు వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. విశ్వకుమార్‌ స్వల్పంగా గాయపడ్డారని, ఆయన ప్రాణాలకు ముప్పు లేదని, మానసికంగా తీవ్ర ఆందోళనకు గురయ్యారని వైద్యులు చెప్పారు. కాగా, చిరిగిన బట్టలతో రక్తం కారుతున్న ముఖంతో శిథిలాల మధ్య నుంచి రమేశ్‌ విశ్వకుమార్‌ వస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు