Homeసాహిత్యంమేం దిమాగీ నకస్ల్స్‌ మే

మేం దిమాగీ నకస్ల్స్‌ మే

- Advertisement -

దిమాక్ ఉన్నోడల్లా దిమాగీ నకస్లైట్ అయితే
నేను దిమాగీ నకస్ల్స్‌నే
అవునిప్పుడు అర్బన్ నకస్లైట్ అరిగిపోయిన పదమా
పాత ఉత్పత్తులను కొత్త కొత్త పేర్లతో
ప్రజల్లో ప్రాపగండా చేసి కార్పొరేట్‌లు అమ్మినట్లు
ఇప్పుడు దిమాగీ నకస్ల్స్‌ పదం తెచ్చావా
కాదు కాదని నా మనసు హెచ్చరిస్తుంది
నకస్లైట్ పదం అర్థాన్ని
నాలుగు దిక్కుల గుంజీ గుంజి పెంచేసి
ఆ చట్రంలో కావాలనుకున్నోన్ని
ఇరికించే కుట్ర కనిపిస్తుంది
ఇప్పుడు నక్సలిజాన్ని
మావోయిజం నుండి విడగొట్టేసి
సాయుధ కమ్యూనిస్టులనే కాదు
ఆలోచించే వాన్నల్లా నకస్లైట్ అనాలి
సామెత పాతదే కావచ్చు
కుక్కను చంపాలంటే పిచ్చిదని ముద్ర వేయాలి
ఇప్పుడు దిమాగీ నకస్ల్స్‌ పేరు అందుకే
పాలనలోపాలపై ప్రశ్నించేవాన్ని ఉద్యమించేవాన్నే కాదు
ఆ దిశగా ఆలోచించే వాన్నల్లా
దిమాగీ నకస్ల్స్‌ పేరేట్టి వేరుపరచాలి ఏరివేయాలి
80 ఏళ్ల స్వాతంత్య్రం సాక్షిగా
ఎంత మంచిమాట సెలవిచ్చారు
మహా ప్రభువులు
ప్రజలెపðడూ డూడు బసవన్నల్లా తల ఊపుతూనే ఉండాలి
కానీ సీను నీవనుకునట్లు లేదు
ఆ తలలో దిమాక్ ఉందని
తలకు రెండు కొమ్ములున్నాయని
బసవన్నలు తెలియజెప్పాయి
తల ఊపం తలదించమని
జంతర్ మంతర్ వద్ద రంకె వేశాయి
దేశమంతా జంతర్ మంతర్ అయ్యేట్లుంది
దిమాక్‌కు పనిచెప్పే టోనల్లా దిమాగీ నకస్ల్స్‌ అందాం
వేరు చేద్దాం ఏరి వేద్దాం
ఎవ్వరేమి వ్యాఖ్యానిస్తే ఏముంది
ఎర్రకోటపై నీ వన్నదదే దేశం
విన్నదదే
కాని ప్రభు
ఇప్పుడు కాలం నీ వెంట కాదు
నీ కంటే వేగంగా పయనిస్తుంది
రంకెలు ఇప్పటికే దేశాన్ని చుట్టేశాయి
దేశమంతా
మేం ‘దిమాగీ నకస్ల్స్‌’ మే
అని నినదిస్తుంది
నిధి (ఉపాధ్యక్షులు అరసం తెలంగాణ రాష్ట్రం)

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు