వాషింగ్టన్: ఇరాన్‌పై యుద్ధంలో తాము గెలిస్తే చమురు ధరలు తగ్గిపోతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తమ దేశంలో పెట్రోల్ ధరలు ఒక గ్యాలన్‌కు రెండు డాలర్ల దిగువకు పడిపోవచ్చని ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు. అమెరికా విజయం సాధిస్తేనే ఇంధన మార్కెట్లలో స్థిరత్వం వస్తుందని ఆయన స్పష్టంచేశారు. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడానికి తాము ఎప్పటికీ అనుమతించబోమని పునరుద్ఘాటించారు. తమపై దాడులు జరిగితే అదే స్థాయిలో ప్రతి దాడులు ఉంటాయని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ తాజా స్పందన రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇదిలావుంటే, కెనడా విమాన తయారీ సంస్థ బాంబార్డియర్ విమానాలను అమెరికాలో విక్రయించడానికి వీల్లేదని కూడా ట్రంప్ తెలిపారు. ఆ సంస్థ అమెరికాలో తయారీ యూనిట్ పెట్టకపోతే అమ్మకాలు నిషేధిస్తామని హెచ్చరించారు. కాగా, వాణిజ్య చర్చలు విఫలమైనప్పటి నుంచి కెనడాపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. మరోవైపు న్యూ మెక్సికో పేరును ‘న్యూ అమెరికా’గా మార్చేందుకు ట్రంప్ ప్రతిపాదన చేశారు. ‘అద్భుతమైన సామర్థ్యం ఉన్న ఆ రాష్ట్ర ప్రజలకు ఇది మరింత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఇది నాకు చాలా ఇష్టం’ అని ట్రంప్ పోస్ట పెట్టారు. అయితే న్యూ మెక్సికో గవర్నర్ మిషెల్ లుహాన్ గ్రిషమ్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. రాష్ట్రం పేరు మార్చడంపై ఎలాంటి చర్చ జరగలేదని, అందుకు అవకాశం లేదని స్పష్టంచేశారు.
మేము గెలిస్తేనే చమురు ధరలు తగ్గుతాయి: ట్రంప్
- Advertisement -
RELATED ARTICLES


