Homeఅంతర్జాతీయంయుద్ధానికి స్పెయిన్ వ్యతిరేకం

యుద్ధానికి స్పెయిన్ వ్యతిరేకం

- Advertisement -

ఎవరి భయంతోనో తప్ప్పును సమర్థించం: పెడ్రో శాంచెజ్

మాడ్రిడ్: అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై దాడులకు దిగడాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తీవ్రంగా ఖండించారు. లక్షల మంది జీవితాలు పణంగా ‘రష్యన్ రోలెట’ (ప్రమాదకర ఆట)ను ఇజ్రాయిల్, అమెరికా ఆడుతోందని విమర్శించారు. యుద్ధానికి మద్దతు ఇవ్వలేదన్న కారణంగా స్పెయిన్‌తో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించడాన్ని పెడ్రో బుధవారం ఆక్షేపించారు. యుద్ధం వద్దు అంటూ మరోసారి స్పష్టంచేశారు. యుద్ధానికి స్పెయిన్ వ్యతిరేకమని, ఎవరో భయపెట్టారని తప్ప్పును సమర్థించదని చెప్పారు. ‘ఘోర మానవతా విపత్తులు ఇలానే మొదలవుతాయి. లక్షల మంది భవిష్యత్‌తో రష్యన్ రోలెట్ ఆడలేరు’ అని టీవీ మాధ్యమంగా జాతిని ఉద్దేశించినన ఆయనన్నారు. ఇరాన్‌పై అక్రమంగా, నిర్లక్ష్యంగా ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేశాయని ఇంతకుముందు కూడా పెడ్రో విమర్శించారు. తెహ్రాన్‌పై దాడుల కోసం దక్షిణ స్పెయిన్‌లోని తమ నేవీ, వైమానిక దళ స్థావరాలను అమెరికా వినియోగించేందుకు వీల్లేకుండా నిషేధం కూడా విధించారు. దీంతో మండిపడ్డ ట్రంప్ స్పెయిన్‌తో వాణిజ్యపరంగా తెగతెంపులకు సిద్ధమయ్యారు.
దీంతో పెడ్రో శాంచెజ్ స్పందిస్తూ ఘర్షణలకు దిగడం, బాంబులు విసరడం, యుద్ధాలు చేయడం ద్వారా ప్రపంచ సమస్యలు పరిష్కారం కాబోవు అని ట్రంప్‌కు హితవు పలికారు. యుద్ధానికి స్పెయిన్ మద్దతివ్వదని పెడ్రో స్పష్టంచేశారు. తమ వైఖరిని నాలుగు పదాలలో ‘నో టు ది వార’గా చెప్పవచ్చన్నారు. ప్రతీకారం భయంతో ప్రపంచానికి హాని కలిగిస్తే సమర్థించేది లేదని తేల్చి చెప్పారు. స్పెయిన్ తన విలువులకు, ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ చేయదని ఆయనన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు