. బరిలో 67 పార్టీలు… 3,405 మంది అభ్యర్థులు
. ఝాపా 5, సర్లాహి 4, రుకుం 1లో రసవత్తర పోటీ
. నిర్భయంగా ఓటేయండి: ప్రధాని ఖార్కి
ఖాట్మండు: నేపాల్ ఎన్నికలకు సర్వసన్నద్ధమైంది. బుధవారం పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది. జెన్ జీ ఆందోళనలు రాజకీయంగా ప్రకంకనల నేపథ్యంలో తాజా ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 2006లో పౌర యుద్ధం ముగిసిన తర్వాత జరగబోయే కీలక ఎన్నికలుగా ఇవి నిలిచాయి. 2025 సెప్టెంబరులో జెన్ జీ ఆందోళనల్లో 77 మంది మరణించిన క్రమంలో దిద్దుబాటు చర్యలకు, నేపాల్‌లో రాజకీయాల దశ మార్చేందుకు అవకాశంగా ఈ ఎన్నికలను భావిస్తున్నారు. జవాబుదారీతనం, సుపరిపాలన, రాజకీయ సంస్కరణలను నూతన ప్రభుత్వం నుంచి ఓటర్లు ముఖ్యంగా యువత ఆశిస్తున్నారు. దీంతో సార్వత్రిక ఎన్నికలు అందరి దష్టిని ఆకర్షిస్తున్నాయి. మొత్తం 67 పార్టీలు పోటీలో ఉన్నాయి. 3,405 మంది అభ్యర్థులు తమ అదష్టాన్నీ పరీక్షించుకుంటున్నారు. నేపాల్‌లో ఓటర్ల లెక్కింపు జఠిలమైన ప్రక్రియ. ఇది మానవీయంగా సాగుతుంది. ఫలితాలు వెలువడటానికి సమయం పడుతుంది. కాగా, ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, హంగ్ పార్లమెంటు ఏర్పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలావుంటే, సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు విస్తతంగా ఏర్పాట్లు చేశారు. రాజధాని ఖాట్మండులో దర్బార్ స్కేర్‌లో పోలింగ్ కేంద్రాలను నెలకొల్పారు. నిర్భయంగా ఓటు వేయాలంటూ దేశ ప్రజలకు ఆపద్ధర్మ ప్రధాని సుశీలా ఖార్కి పిలుపునిచ్చారు. ఓటింగ్ కోసం అవసరమైన సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా నేపాల్‌లోని గిరి ప్రాంతాలకు చేర్చారు. మార్క్సిస్టు సీనియర్ నాయకుడు కేపీ శర్మ ఓలీ (74) గతేడాది ప్రధాని పదవిని వీడారు. ఇప్ప్పుడు మరలా ప్రధాని రేసులో నిలిచి సొంత నియోజకవర్గం నుంచి అదష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనకు ఖాట్మండు మాజీ మేయర్ బలేంద్ర షా (35) నుంచి పోటీ ఉంది. దేశవ్యాప్తంగా 19 మిలియన్ల (1.9 కోట్లు) మంది ఓటర్లు ఉండగా, ఒక్క ఝాపా5 నియోజకవర్గంలోనే 1,63,000 మంది ఓటర్లున్నారు. వీరు ఓలీ, షా రాజకీయ భవిష్యత్‌ను తేల్చబోతున్నారు. ఝాపా5 తో పాటు సర్లాహి 4, రుకుం1 ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. నేపాలీ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు గగన్ థాపా... మాదేశ్ ప్రావిన్స్‌లోని సర్లాహి4 నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత అమ్రేశ్ కుమార్ సింగ్ నుంచి థాపా పోటీని ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గంలో 1,21,012 ఓటర్లు ఉండగా, వీరిలో 40 శాతం మంది 1840 మధ్య వయస్కులు ఉన్నారు. మూడు సార్లు పధానిగా ఉన్న పుష్ప కమల్ దహల్ ఈసారి రుకుమ్1 నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 34,772 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 45 శాతం మంది 18`40 మధ్య వయస్కులున్నారు. ఈసారి గెలవకపోతే 71 ఏళ్ల దహల్‌కు ఇదే చివరి ఎన్నిక కావచ్చు.


