మూడు రోజుల విషాదం తర్వాతే ఖననం – అధినేతకు తెహ్రాన్ కన్నీటి వీడ్కోలు
తెహ్రాన్: ఇరాన్ అధినేత ఆయాతుల్లా అలీ ఖామేనీ (86) అంత్యక్రియలు పవిత్ర నగరం మషాద్‌లో జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే మొదలుపెట్టారు. 36 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన ఖామేనీ… అమెరికాఇజ్రాయిల్ సంయుక్త దాడుల్లో శనివారం ప్రాణాలు కోల్పోయారు. ఆయన పుట్టినది మషాద్‌లోనే. ఇది ఇరాన్లో రెండవ అతిపెద్ద నగరం. ఖామేనీ తండ్రి అంత్యక్రియలు కూడా అక్కడి ఇమామ్ రెజా పవిత్ర స్థలంలోనే జరిగాయి. అధినేత అంతిమ సంస్కారాలకT సంబంధించిన కార్యక్రమం మూడు రోజులు సాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అంతకుముందు భారీ అంతిమ యాత్ర జరుగుతుందన్నారు. తమ ప్రియతమ నాయకుడికి రాజధాని తెహ్రాన్ అంతిమ వీడ్కోలు పలికే కార్యక్రమం బుధవారం రాత్రి 10 గంటలకు జరిగింది. తెహ్రాన్ ఇమామ్ ఖోమెయినీ ప్రార్థనా మైదానం ఇందుకు వేదికైంది. ఈ మేరకు రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది. అంత్యక్రియలు ఎప్ప్పుడో ప్రకటించలేదు. ఇదిలావుంటే, ఖామేనీ మరణంతో అధికార పగ్గాలు చేపట్టేబోయేది ఎవరన్న కసరత్తు మొదలైంది. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు అయింది. కాగా, భద్రతా కారణాల దష్ట్యా ఖామేనీ అంత్యక్రియలు ముగిసేంత వరకు అసెంబ్లీ తుది సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. అయితే మంగళవారం అమెరికాఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో పవిత్ర నగరం ఖోమ్‌లోని 88 మంది సభ్యులకు నిలయమైన చట్టసభ దెబ్బ తిన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అలాగే దేశ రాజధానిలోని ప్రధాన కేంద్ర కార్యాలయంపైనా దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి.


