Homeఆంధ్రప్రదేశ్ఇరాన్ యుద్ధ నౌక మునక

ఇరాన్ యుద్ధ నౌక మునక

- Advertisement -

100 మందికిపైగా గల్లంతు?
శ్రీలంక తీరంలో ఘటన

కొలంబో: పశ్చిమాసియా అట్టుడికిపోతున్న వేళ శ్రీలంక తీరంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. దక్షిణ తీరంలో మునిగిపోతున్న ఇరాన్ యుద్ధ నౌక నుంచి 32 మందిని రక్షించినట్లు శ్రీలంక తెలిపింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఏడుగురికి అత్యవసర చికిత్స అవసరమైనట్లు వెల్లడించింది. ‘గాలె తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ‘ఐఆరఐఎస్ దేనా’ అనే ఇరాన్ యుద్ధ నౌక ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం అందింది. సహాయక చర్యల కోసం నౌకలు, ఎయిర్‌ఫోర్స్ విమానాలను శ్రీలంక పంపింది. నౌకలో 180 మంది ఉన్నట్లు తెలిసింది. వారిలో 30 మందిని కాపాడాం’ అని శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ పార్లమెంటుకు వివరించారు. ఇజ్రాయిల్, అమెరికా దాడులు, ఇరాన్ ప్రతి దాడులతో పశ్చిమాసియా యుద్ధంలో చిక్కుకున్న తరుణం ఈ నౌక ఎలా దెబ్బతిన్నది, సిబ్బందికి ఎలా గాయాలయ్యేయి వంటి వివరాలు తెలియాల్సి ఉన్నట్లు ఉన్నతాధికారి వెల్లడించారు. జలాంతర్గామి దాడి జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ ఘటనలో 100 మందికిపైగా గల్లంతయ్యారని, 78 మంది గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘ఐఆరఐఎస్ దేనా’ ఇరాన్‌కు చెందిన నూతన యుద్ధ నౌకల్లో ఒకటి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన విన్యాసాల్లో ఇది పాల్గొని, తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు