కీవ్: రష్యాకు యుద్ధాన్ని ఆపే ఉద్దేశం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. నాలుగేళ్లకుపైగా రష్యాఉక్రెయిన్ మధ్య యుద్ధంలో భారీగా ప్రాణఆస్థి నష్టం సంభవించిన విషయం విదితమే. శాశ్వత కాల్పుల విరమణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలపునిచ్చారు. కానీ ఈ రెండు దేశాలు తాత్కాలిక కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఇదే క్రమంలో భవిష్యత్ దాడులకు సిద్ధమవుతున్నట్లు జెలెన్‌స్కీ ప్రకటించారు. మంగళవారం దాడులు కొనసాగినట్లు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘రష్యాకు యుద్ధం ఆపాలని లేదు. మేము కొత్త దాడులకు సిద్ధం కాక తప్పడంలేదు. ఏదిఏమైనా శాంతి నెలకొనాలి. అందుకోసమే మేము కసరత్తు చేస్తున్నాం’ అని జెలెన్‌స్కీ వెల్లడించారు.
రష్యాకు యుద్ధం ఆపాలని లేదు: జెలెన్‌స్కీ
- Advertisement -
RELATED ARTICLES


