న్యూయార్క్: ఇరాన్`అమెరికా మధ్య యుద్ధం వేళ పాకిస్థాన్ మధ్యవర్తిత్వం నేపథ్యంలో తెహ్రాన్ సైనిక విమానాలను తమ ఎయిర్‌ఫీల్డ్‌లలో పార్కింగ్ చేసేందుకు ఇస్లామాబాద్ అనుమతి ఇచ్చినట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక విమానాలు నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ లో నిలిపి ఉంచినట్లు వెల్లడించింది. లాక్‌హీడ్ సి-130 హెర్క్యులస్ రవాణా విమానం, ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్‌సీ-130తో సహా అనేక విమానాలు పార్కింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల నుంచి తమ వైమానిక, సైనిక ఆస్తులను రక్షించుకోవడంలో భాగంగా ఇరాన్ ఇలా చేనట్టు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్ పౌర విమానం అఫ్గానిస్థాన్‌లో ఉన్నట్లు వెల్లడించాయి. ఈ కథనాలపై పాకిస్థాన్ సీనియర్ అధికారి స్పందిస్తూ నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ పట్టణ ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ రహస్యంగా ఏమీ జరగడం సాధ్యం కాదన్నారు.
యుద్ధం ప్రారంభం కావడానికి ముందు మహాన్ ఎయిర్‌కు చెందిన ఒక ఇరాన్ పౌర విమానం కాబుల్‌లో దిగిందని అఫ్గాన్ పౌర విమానయాన అధికారి తెలిపారు. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో అది అక్కడే ఉండిపోయిందన్నారు. అఫ్గాన్‌లో ఇరాన్ విమానాలు ఉన్నాయనే వార్తలను తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తోసిపుచ్చారు. యూఎస్ సెనెటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఇదే నిజమైతే.. యుద్ధం ముగింపుపై మధ్యవర్తిగా పాక్ పాత్రను పునఃపరిశీలించాలన్నారు.
పాక్‌లో ఇరాన్ విమానాల రహస్య పార్కింగ్?
- Advertisement -
RELATED ARTICLES


