Wednesday, November 27, 2024
Homeఅంతర్జాతీయంరష్యా దళాల అదుపులో బ్రిటన్‌ జాతీయుడు

రష్యా దళాల అదుపులో బ్రిటన్‌ జాతీయుడు

కీవ్‌: రష్యా- ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం తీవ్రరూపు దాల్చుతున్న సమయంలో ఉక్రెయిన్‌ తరఫున యుద్ధం చేస్తున్న ఓ బ్రిటన్‌ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా బలగాలు వెల్లడిరచాయి. బ్రిటన్‌కు చెందిన జేమ్స్‌ స్కాట్‌ రైస్‌ ఆండర్సన్‌ అనే వ్యక్తి సైనిక దుస్తులు ధరించి, ఉక్రెయిన్‌ తరఫున యుద్ధంలో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడిరచారు. గతంలో అతడు బ్రిటిష్‌ సైన్యంలో పని చేసినట్లుగా గుర్తించామన్నారు. అతడికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. కాగా ఈ ఆరోపణలపై బ్రిటిష్‌ విదేశాంగ కార్యాలయం స్పందిస్తూ తమ దేశానికి చెందిన పౌరుడిని రష్యా అధికారులు నిర్బంధించారని…ఈ సమయంలో బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది. కాగా.. వేయి రోజులు పూర్తవుతున్నా రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం భీకరంగానే సాగుతోంది. ఈక్రమంలోనే దీర్ఘశ్రేణి క్షిపణులను మాస్కోపై ప్రయోగించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉక్రెయిన్‌కు అనుమతి ఇవ్వడంతో అమెరికా తయారుచేసిన ఏటీఏసీఎంఎస్‌ క్షిపణులను ఉక్రెయిన్‌ శత్రుదేశంపై ప్రయోగించింది. కాగా ఉత్తరకొరియా సైన్యం రష్యాకు సైనికులు, ఆయుధాలను సరఫరా చేస్తున్న నేపథ్యంలోనే బైడెన్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఇతర దేశాలు కల్పించుకుంటే మూడో ప్రపంచయుద్ధం తప్పదని హెచ్చరించారు. అణ్వస్త్ర ప్రయోగానికి మార్గం సుగమం చేసేలా ఓ దస్త్రంపై సంతకం చేశారు. దీంతోపాటు ఉక్రెయిన్‌కు సహాయ సహకారాలందించే దేశాలను యుద్ధంలో తమ ప్రత్యర్థులుగానే భావిస్తామని ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు