Homeఆంధ్రప్రదేశ్రాజ్ కెసిరెడ్డికిబెయిల్ తిరస్కృతి

రాజ్ కెసిరెడ్డికిబెయిల్ తిరస్కృతి

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఏపీ మద్యం కుంభకోణం చాలా పెద్దది. అధికారులు కుమ్మక్కు కాకపోతే ఇలాంటివి జరగవు’ అని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరమ న్నారు. ప్రభుత్వానికి రాజ్ కెసిరెడ్డి సలహాదారు మాత్రమేనన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కెసిరెడ్డి సలహాదారు మాత్రమే కాదని, మొత్తం కుంభకోణానికి ఆయనే సూత్రధారి అని వ్యాఖ్యానించింది. పదవిలో ఉన్నవారి అండ లేకుంటే అధికారులు ఇలా చేయలేరని పేర్కొంది. కెసిరెడ్డికి జైలులో 10 నెలలు గడిచిపోయానని, సప్లిమెంటరీ చారిషీట్లు దాఖలు చేశారని ఆయన తరపు న్యాయవాది చెప్పగా, పర్వాలేదు, ఇంకొంతకాలం జైలులో ఉండనివ్వండి’ అని సీజేఐ అన్నారు. కెసిరెడ్డికి Âబెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. పిటిషన్‌ను కొట్టివేస్తామన్నారు. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని కెసిరెడ్డి తరపు న్యాయవాది తెలియజేయడంతో ధర్మాసనం అందుకు అనుమతించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు