Wednesday, May 28, 2025
Homeరుతు పవనాలు వచ్చేశాయ్‌

రుతు పవనాలు వచ్చేశాయ్‌

వారం రోజులు ముందుగానే వర్షాలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రానికి ముందస్తుగానే రుతు పవనాలు వచ్చేశాయ్‌. సోమవారం రాయలసీమను తాకాయి. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. 2024లో జూన్‌ 2న రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించగా... ఈ ఏడాది వారం రోజుల ముందే రాష్ట్రాన్ని తాకాయి. తూర్పు అరేబియా సముద్రం నుంచి ఉత్తర ఒడిశా వరకు, మధ్య మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ చత్తీస్‌గఢ్‌ మీదుగా ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది 27వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 25వ తేదీ నాటికి మధ్య మహారాష్ట్రలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడిన తర్వాత దాని అవశేషాలు (ఉపరితల ఆవర్తనం) తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తర్వాత బలపడి ఉత్తర వాయువ్యంగా ఉత్తర ఒడిశా వైపు పయనించనుంది. దీనివల్ల రుతుపవనాలు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఏపీ, దానికి ఆనుకుని ఒడిశా పరిసరాల వరకు విస్తరించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రం నుంచి మధ్యమహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఒడిశా వరకు ఉపరితలద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఈనెల 25వ తేదీ నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో చాలాచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడునాలుగు రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈసారి సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు న్నాయి. వర్షాల రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కోస్తా యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల పడనున్నాయి. ఉరుములతో కూడిన మెరుపులు…బలమైన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురవనున్నాయి. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడనున్నాయి. రాయలసీమ సమీంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు