Homeరైతు కన్నెర్ర

రైతు కన్నెర్ర

- Advertisement -

చలో విజయవాడ – సీఎం రాయబారంలో ఉద్రిక్తత

రెచ్చిపోయిన ఖాకీలు… బూటు కాళ్లతో దాడులు
రైతులపై పిడిగుద్దులు… తోపులాట

  • ఇది పోలీసు రాజ్యమా? నాయకుల మండిపాటు
  • భద్రతను ఛేదించి… కదం తొక్కిన అన్నదాత
  • మార్మోగిన సీఎం డౌన్ డౌన్ నినాదాలు

అన్నదాతలు కన్నెర్ర చేశారు… పాలకుల వెన్నులో వణుకు పుట్టించారు. రాజధాని నడిబొడ్డున… విజయవాడలో రైతులు, రైతు సంఘాల నాయకులు గర్జించారు. రైతులు, కౌలు రైతుల సమస్యల పరిష్కా రానికి డిమాండ్ చేస్తూ మంగళవారం చలో విజయవాడను, సీఎం రాయబారం కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించారు. అలంకార్ సెంటర్‌లో ధర్నా చౌక్ వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గంటకుపైగా ప్రతిష్టంభన కొనసాగింది. మూడంచెల బారికేడ్లతో పోలీసులు అడ్డుకున్నా రైతులు వెనక్కి తగ్గలేదు. ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లారు. పోలీసులు సృష్టించిన అడ్డంకులు దాటుకుంటూ ఐక్యంగా కదం తొక్కారు. సీఎం డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తిం చారు. ఖాకీలు రెచ్చిపోయి… బూటుకాళ్లతో రైతులపై చేసిన దాడులను నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది పోలీసు రాజ్యమా అంటూ నిలదీశారు. ప్రజా స్వామ్య హక్కులను కాలరాస్తున్నా రంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల శాంతియుత నిరసనను హింసాత్మ కంగా మార్చే ప్రయత్నాలను గర్హించారు. రైతులపై దాడులకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. 25 ప్రధాన డిమాండ్ల పత్రాన్ని సీఎంకు అందజేసే ప్రయత్నం చేశారు. వాటిని పరిష్కరించే దిశగా వెంటనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో రైతాంగ ఉద్య మాలు మరింత ఉధృతంగా జరుగుతాయని పాలకులను హెచ్చరించారు.

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం సంయుక్త అధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో చలో విజయవాడతో పాటు సీఎం రాయబారం ప్రదర్శన పోరాట స్ఫూర్తితో సాగాయి. అన్ని జిల్లాల నుంచి రైతులు, కౌలు రైతులు ధర్నా చౌక్‌కు కదంతొక్కారు. చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ముక్తకంఠంతో ఖండించారు. 25 ప్రధానాంశాలతో కూడిన వినతిపత్రాన్ని సీఎంకు అందజేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి.రామచంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.కాటమయ్య, ఉపాధ్యక్షుడు ఎ.రామానాయుడు, కార్యదర్శి జగన్నాథం, ఉలవలపూడి రాములు నాయకత్వంలో ‘సీఎం రాయబారం’ పేరుతో ప్రదర్శన సీఎం క్యాంపు కార్యాలయం వైపు కదిలింది. రైతులు ప్లకార్డులు, బ్యానర్లు, ఆకుపచ్చ కండువాలతో కదం తొక్కారు. ఏఐకేఎస్ జెండాలు ప్రదర్శిస్తూ కొందరు ఉద్యమ స్ఫూర్తిని చాటారు. ‘సీఎం డౌన్ డౌన్, రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ, డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల అమలు, అన్ని పంటలకు మద్ధతు ధరలు, సాగు ఖర్చులు తగ్గించాలని, కౌలు రైతులకు రుణాలివ్వాలని, గుర్తింపు కార్డులు జారీ చేయాలి అంటూ నినదించారు. సీపీఐ, ఏఐవైఎఫ్, ఏఐ‌ఎస్‌ఎఫ్, ఏఐటీయూసీ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు రైతాంగ పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ప్రదర్శనలో పాల్గొన్నారు. రైతుల శాంతియుత ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. అలంకార్ సెంటర్ వద్ద మోహరించిన బలగాలు… మూడంచెల ఇనుప బారికేడ్లతో దిగ్బంధం చేశారు. ధర్నా చౌక్ నుంచి లెనిన్ సెంటర్ వైపు కదులుతున్న రైతాంగాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బారికేడ్లT దాటుకొని వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా, పోలీసులు బలప్రయోగానికి దిగారు. రైతులపై పిడిగుద్దులు కురిపించారు. బలవంతంగా ఈడ్చిపారేశారు. బూటుకాళ్లతో తన్నారు. పోలీసులు బూట్లతో తొక్కడంతో రంపచోడవరం గిరిజన రైతుసంఘం నాయకులు జుత్తు కుమార్ కాలి బొటనవేళ్లు నలిగి తీవ్ర గాయాలయ్యాయి. తోపులాట కూడా జరిగింది. అనకాపల్లి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు గాయపడ్డారు. ఇదిలావుంటే, అప్పటికే ఒకవైపున ఉన్న యువజన, విద్యార్థి, కార్మిక సంఘాల కార్యకర్తలు రైతులకు అండగా నిలిచారు. బారికేడ్లT దాటు కొని లెనిన్ సెంటర్ వంతెన వరకు బృందంగా చేరుకున్నారు. ఆటోలను రోడ్డుకు అడ్డంగా పెట్టి అదనపు బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు ఆ మార్గాన్ని మూసివేశారు. అయినప్పటికీ నిరసనకారులు వెనుదిరగలేదు. తమ పోరాటం కొనసాగించారు. తమ న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న రైతులపై పోలీసు దాడులను, వివరణ ఇచ్చేందుకు పోలీసు ఉన్నతాధికారుల ప్రయత్నాలపై నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే: ఈశ్వరయ్య
రైతుల డిమాండ్లT వినకుండా ప్రభుత్వం పోలీసులను ముందుకు నెట్టడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. అలంకార్ సెంటర్‌లో బారికేడ్లపైకి ఎక్కి ఆయన మాట్లాడారు. పోలీసులను ఆయుధంగా ఉపయోగిస్తోందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈశ్వరయ్యను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా అక్కడ రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు సహా అనేక మంది నాయకులు బారికేడ్లు దాటి అవతలి వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్తతల నడుమ ఈశ్వరయ్య, రామచంద్రయ్య, కాటమయ్య, రామానాయుడు, మల్నీడు యలమందారావు, హనుమారెడ్డి, డేగా ప్రభాకర్, చిరుతల మల్లికార్జున, బుడితి అప్పలనాయుడు, ఉలవలపూడి రామారావు, జమలయ్యతో పాటు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, దుర్గాభవానీ తదితరులు అడ్డంకులను ఛేదించి లెనిన్ సెంటర్ వంతెనపైకి చేరుకున్నారు. వెంటనే పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయిన ప్పటికీ చల్లపల్లి బంగ్లా వైపునకు రైతాంగం కదం తొక్కింది. ప్రదర్శన సాగిన మార్గం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలతో మార్మోగింది. తమ జీవన హక్కులు పరిరక్షించా లని రైతులు డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ హస్తగతానికి చేసే ప్రయత్నాలు వద్దని హెచ్చరించారు. ఈశ్వరయ్య అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలపై, అవి అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా తమ పోరాటం సాగుతుందేగానీ పోలీసులకు వ్యతిరేకంగా కాదని అన్నారు. రైతులను పోలీసులు అడ్డుకోవడం, వారిపై బý ప్రయోగం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది పోలీసు రాజ్యమా అంటూ నిలదీశారు. ఈ పరిణామం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. రైతులపై దాడికి బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల 25 డిమాండ్లపై పాలకులు వెంటనే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలు మరింత ఉధృతంగా సాగుతాయని గుజ్జుల ఈశ్వరయ్య హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు