పనామా సిటీ: పనామా కార్మికుడు రోడ్డెక్కారు. తమకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. అనేక రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. సామాజిక భద్రతా చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తమ నిరసన ప్రదర్శనలతో వీధులను హోరెత్తిస్తున్నారు. రహదారులను దిగ్బంధిస్తున్నారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇదే క్రమంలో గురువారం బెలిసారియో పోరస్ పార్కు నుంచి నేషనల్ అసెంబ్లీ (పార్లమెంటు) వరకు భారీ ప్రదర్శనకు పూనుకున్నారు. సామాజిక భద్రతా నిధి (సీఎస్‌ఎస్)పై బిల్లు 163 తీసుకు రావడానికి వ్యతిరేకంగా ప్యూబ్లో యునిడో పోర్లావిడా కూటమి నాయకత్వంలో కార్మికుల నిరసనలు మిన్నంటాయి. నేషనల్ యూనియన్ ఆఫ్ కనస్ట్రక్షన్ వర్కర్స్ ఇంటస్ట్రీ అండ్ సిమిలర్ (సన్‌ట్రాక్స్)కు చెందిన 83 మంది సభ్యులపై న్యాయ ప్రక్రియ మధ్యతో ఈ చట్టంపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. కొత్త ఆసుపత్రి డెల్ నినో నిర్మాణ క్రమంలో ఈనెల 12న అరెస్టు అయిన కార్మికుల కోసం ముందస్తు చర్యలను ఖరారు చేయనున్నారు. ప్రభుత్వాధికారులపై దాడులు, చేయడం వ్యక్తిగత సమగ్రత, స్వేచ్ఛకు విఘాతం కలిగించడం, దోపిడీకి పాల్పడటం వంటి నేరాల తీవ్రత దృష్ట్యా అరెస్టులు జరిగినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. సన్‌ట్రాక్స్ ప్రధాన కార్యదర్శి సౌల్ మెండెజ్ మాట్లాడుతూ నిర్బంధంలో ఉన్నవారిని వేధింపులకు గురిచేస్తున్నారని, వీరిలో అనేక మంది మహిళలు ఉన్నారని ఆరోపించారు. ఇదే అంశమై అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐఎల్‌ఓ)కు ఓ నివేదికను సన్‌ట్రాక్స్ ఇప్పటికే సమర్పించినట్లు తెలుస్తోంది. ఆ నివేదికపై నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్ యూనిటీ (కౌనుసీ) ప్రధాన కార్యదర్శి మార్కో ఆండ్రేడ్ కూడా సంతకం చేశారు. నిర్బంధానికి గురైన కార్మికులతో క్రూరంగా ప్రవర్తిస్తుండటమే కాకుండా వారికి చట్టప్రకారం సేవలు అందించే క్రమంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్న విషయాన్ని డిఫెన్స్ లాయర్లు ప్రస్తావించారు.
రోడ్డెక్కిన పనామా కార్మికులుసామాజిక భద్రతా చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు
RELATED ARTICLES