Sunday, March 30, 2025
Homeలోకల్‌ వార్‌

లోకల్‌ వార్‌

. ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఉపఎన్నికలు
. కడప జెడ్పీ పీఠం వైసీపీ కైవసం
. ఎన్నిక బహిష్కరించిన టీడీపీ
. అనపర్తి ఎంపీపీ బీజేపీ పరం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రంలో ఖాళీ అయిన స్థానిక సంస్థల స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార కూటమిప్రతిపక్ష వైసీపీ మధ్య అక్కడక్కడా ఎంపీటీసీల అడ్డగింత, బల ప్రదర్శనలు తదితర ఘటనలతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తంగా 51 స్థానాలకు ఎన్నికలకు ఏర్పాట్లు చేయగా, అందులో 28 ఎంపీపీలు, 23 వైస్‌ ఎంపీపీ స్థానాలున్నాయి.ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల అధికార కూటమికి, మరికొన్ని చోట్ల వైసీపీకి షాక్‌లు తగిలాయి. ఊహించని విధంగా ఒక ఎంపీపీ స్థానాన్ని తొలిసారి బీజేపీ కైవసం చేసుకుంది. కోరం లేకపోవడంతో ఏలూరుజిల్లా కైకలూరు వైస్‌ ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు. మెజార్టీ స్థానాలను తాము కైవసం చేసుకున్నట్లు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రకటించుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలను అధికారింగా ధ్రువీకరించాల్సి ఉంది.
ఉమ్మడి కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా వైసీపీకి చెందిన రామగోవింద రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ ప్రకటించారు. ఒకే నామినేషన్‌ రావడంతో ఎన్నికైనట్లు కలెక్టర్‌ ధ్రువీకరించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా రామ గోవిందరెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు. కడప పరిషత్‌ చైర్మన్‌ పదవికి తాము పోటీ చేయడం లేదని టీడీపీ కూటమి ప్రకటించింది. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అటు ప్రకాశంజిల్లా త్రిపురాంతకం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ విజయం సాధించారు. తూర్పుగోదావరిజిల్లా అనపర్తిలో వైసీపీకి గట్టి షాక్‌ తగిలింది. బిక్కవోలులో వైసీపీ ఎంపీటీసీలు ఆ పార్టీకి రాజీనామా చేసి…బీజేపీ తీర్థం పుచ్చుకు న్నారు. ఈ సందర్భంగా వారికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. అనంతరం ఎంపీపీ ఎన్నికల్లో తొస్సిపూడి ఎంపీటీసీలు తేతలి సుమను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రిటర్నింగ్‌ అధికారి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ఎంపీపీగా తేతలి సుమ ఎన్నికయ్యారు.
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ , వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వైసీపీకి చెందినవారు మాజీ మంత్రి కారుమూరి నివాసం నుంచి ఎంపీటీసీలతో వెళ్తుండగా…అక్కడ వారిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నారపాడులో వైస్‌ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. గతంలో వైస్‌ ఎంపీపీగా ఉన్న చొక్కాకుల గోవింద్‌ రాజీనామా చేయడంతో ఈ ఖాళీ ఏర్పడిరది. దీంతో ఎంపీటీసీలు జనసేన అభ్యర్థి మామిడి లక్ష్మీని వైస్‌ ఎంపీపీగా ఎన్నుకున్నారు.
ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండల ఎంపీపీ వైసీపీ పరమైంది. మొత్తం 14 మంది ఎంపీటీసీలు ఉండగా వైసీపీ 13 గెలుపొందగా టీడీపీ నుంచి ఒకరు గెలుపొందారు. వైసీపీ నుంచి ఒకరు టీడీపీలోకి చేరారు. ప్రస్తుతం టీడీపీకి ఇద్దరు, వైసీపీకి 12 మంది సభ్యులు ఉన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు వైస్‌ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. టీడీపీ కూటమి, వైసీపీ మధ్య పోటీ నెలకొంది. మొత్తం 22 మంది ఎంపీటీసీలకు గాను ఒకరు మరణించగా, మరొకరు రాజీనామా చేశారు. ఉన్న 20 మందిలో కూటమికి పది, వైసీపీకి పది మంది ఉండటంతో పోటీ ఉత్కంఠ మారింది. ఎన్నిక జరిగే ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేశారు. వైసీపీ ఎంపీటీసీలు వ్యూహాత్మకంగా ఈ ఎన్నికకు దూరం కాగా…టీడీపీ ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు. దీంతో ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేశారు.
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన ఎంపీపీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎంపీటీసీలు సామాజిక వర్గాలుగా విడిపోయారు. ఇప్పటివరకు ఎంపీపీగా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీ ఉండగా…ఈసారి తమ సామాజిక వర్గానికి ఇవ్వాలని శెట్టి బలజ వర్గం నేతలు కోరుతున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సత్యవతిని ఎంపీపీగా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌ ప్రకటించారు. దీంతో ఇక్కడ ఎన్నిక రసవత్తరంగా మారింది. కుప్పం ఎంపీపీ ఉప ఎన్నికల్లో తీవ్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంపీటీసీలు వెళ్తున్న బస్సును కూటమి నేతలు అడ్డుకున్నారని వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ ఆరోపించారు. కోరం లేకుండా ఎన్నిక నిర్వహించిన విధానంపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన వెల్లడిరచారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం ఎంపీపీ ఎన్నికలో ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎంపీపీగా ఉన్న శాంతకుమారి మరణంతో ఇక్కడ ఎంపీపీ ఎన్నిక జరుగుతోంది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో ఒక్క ఎంపీటీసీ కూడా టీడీపీకి దక్కలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. నరసారావుపేట రూరల్‌ మండలంలో వైస్‌ ఎంపీపీ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు