చింతపట్ల సుదర్శన్
ఈ భూమ్మీదకు వచ్చిన ఏ ప్రాణి అయినా తను ఎందుకు ఈ లోకంలోకి వచ్చిందో, ఏం చేయడానికి వచ్చిందో ఎప్పుడో ఒకప్పుడు ఆలోచించాల్సిందే అనుకుంటూ కళ్లు మూసుకుంది డాంకీ. కాసేపటికి “గాల్లో తేలుతున్నట్టుందే” అనుకుంది. ఎక్కడ ఉందో తెలీదు కానీ, ఓ ఎత్తయిన కుర్చీ మీద కూచున్న అపరిచితుడు కనపడ్డాడు. తమరెవరు సార్! నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనడిగింది డాంకీ. నువ్వు లోకంలోకి ఎందుకు వచ్చావో ఏం చెయ్యడానికి వచ్చావో అని ఆలోచించావు కదా. ‘క్లారిటీ’గా చెప్దామని రప్పించా ఇక్కడికి అన్నాడు అపరిచితుడు. అవునా! ‘యు ఆర్ సో గుడ్’. నా ‘డవుట్సు క్లియర్’ చేసేందుకే రప్పించినందుకు థాంక్స్, కృతజ్ఞతలు, ధన్యవాద్. సార్ ! ముందు నాకొకక్క మాట స్పష్టం చెయ్యండి. లోకంలో అనేక ప్రాణులున్నవి కదా. ముఖ్యంగా అన్ని ప్రాణుల మీదా అధికారం చలాయించే తెలివీ, శక్తీ ఉన్నాయని తెగనీల్గే మనుషులున్నారు కదా. కొందరిని మనుషులుగా పుట్టించి, కొందర్ని నాలా గాడిదలుగా పుట్టించడం సబబా, బేసబబా చెప్పండి అంది డాంకీ. అపరిచితుడు డాంకీ వైపు కొరకొరా చూసేడు. తర్వాత అదంతా జన్మ రహస్యం. గాడిద రూపంలో ఉన్న నీకు అర్థం కాదులే కాని నువ్వు కూడా పోయిన జన్మలో మనిషివే. ఒకానొక రోజున దారంట పోతూ ఓ ఆవు తోకని తొక్కావు. ఆ నేరానికి ఇప్పుడిలా గాడిదవై పుట్టావు అన్నాడు. ఇది అన్యాయం, దారుణం. ఈ దేశంలో గోవు గొప్పదన్న ప్రవచనాలు వినిపించే వారున్నారు కాని, ఆవు తోక పొరపాటున తొక్కొద్దని ఎవరూ అనలే. అసలు నేను చేసింది పొరపాటు కానీ ‘క్రైమ్’ కానే కాదు. నేరానికీ శిక్షకూ అసలు సంబంధమే లేదు అంది డాంకీ ఉక్రోషంగా. ఏది క్రైమో ఏది కాదో నిర్ణయించాల్సింది మేం. మనుషుల్ని గాడిదల్ని చేసే ‘పవర్’ ఉంది మాకు. చిన్న పొరపాటుని, నేరాన్ని చేసి దాన్ని భూతద్దంలో పెడ్తాం అది మా ఇష్టం. ఆ అధికారం మా స్వంతం. ఇప్పుడు తెల్సింది కదా నీ జన్మ రహస్యం అని అపరిచితుడు అంటుండగానే దబ్బుమని అరుగు మీద పడ¦ డాంకీకి నిద్ర ఎగిరిపోయింది. అప్పటికే అరుగు మీద, ఎన్నికలయ్యాక కౌంటింగ్ సమయంలో రిజల్టు కోసం ‘sస్ట్లెస్’ గా పచార్లు చేస్తున్న పొలిటీషన్లా అటూ ఇటూ తిరుగుతున్నది డాగీ. ఏంటి డాగీ… నిద్దర రావట్లేదా అంది డాంకీ. ఏం నిద్రో పైనించి దబ్బుమని కింద కూలబడినట్టయి లేచాను అంది డాగీ. యమూటూ డాగీ… నీకూ అపరిచితుడు ‘గాలిలో తేలినట్టుందే’ అనే పాట వినిపించాడా? చెప్పు ఏం జరిగిందో! విశ్వాసానికి మారుపేరు అని అందరూ పొగిడే ఈ కుక్క బతుకూ ఓ బతుకేనా అని ఆలోచిస్తుంటే గాల్లో తేలిపోయి ఓ అపరిచితుడి ముందు నిలబడ్డాను. కుక్కను కదా కొంచెం నోరు పెద్దది కదా! కోట్ల మంది మనుషుల్ని పుట్టించినోడివి, నన్నూ మనిషిగా పుట్టిస్తే నీ సొమ్ము నీ ముత్తాత సొమ్ము ఏం పోయింది అని అరిచా. కరిచేస్తాననుకున్నాడేమో, ఎత్తయిన కుర్చీలో కాళ్లు పైకి లాగి పెట్టుకుని గత జన్మలో నేనూ మనిషినేనంట కానీ ఏదో క్రైమ్ చెయ్యడం వల్ల కుక్కనై పుట్టానన్నాడు. అవునా ‘క్రైమ్’ అనేమాట అననే అన్నాడా ఇంకా ఏమన్నాడో చెప్పు అంది డాంకీ ఆసక్తిగా. నేను మనిషిగా ఉన్నప్పుడు నా ముఖం మీద వాలిన ఓ దోమని అరచేయి చాచి కొట్టానుట అది ‘పెద్ద క్రైమ్’ ట అంది డాగీ. అంటే మరి దోమని చంపడం హత్యానేరం అని భావించాడేమో గురుడు అంది డాంకీ. దోమ ఛáస్తే కదా, నా చేయి చెంపను తాకకముందే ఎగిరి చక్కాపోయిందిట అయినా నేను చేసింది నేరమేనని ఇదిగో ఇలా డాగ్‌గా పుట్టించేట్ట. అసలు నాకొకటి అర్థం కాలేదు. దోమ సేఫ్‌గానే వుంది. నా చెంప మీద నా అయిదు వేళ్లు అచ్చుగుద్దినయి. అయినా తప్పు నాదేనా ఆ మాటే అడిగితే ఇప్పుడు తెలిసింది కదా నీ జన్మరహస్యం అని అపరిచితుడు అన్నాడో లేదో, ఇలా అరుగు మీద పడ్డాను అంది డాగీ. మాటల్లో తెల్లారిపోయింది అని డాంకీ అంటూ వుంటే అబ్బాయి అరగు ఎక్కాడు. ఏంటి ఇద్దరూ నిద్దర లేచి కబుర్లు ఆడుతున్నారే అన్నాడు. దీన్ని ‘కోఇన్సిడెన్స్’ అంటారో ఏమో నాకు తెలీదు కానీ నా గాడిద జన్మను గురించి ఆలోచిస్తుంటే ఓ అపరిచితుడు నేను గత జన్మలో చేసిన ‘క్రైమ్’ కారణంగా గాడిదనయ్యానన్నాడు. ఈ డాంకీకి కూడా ఇదే జరిగింది. తన చెంప తను ఛెళ్లుమనిపించుకున్నందుకు కుక్కయి పుట్టిందట అంది డాంకీ. ఏంటి డాంకీ, డాగీ మీరూ కలలు కంటారా ? ఇది నేనెక్కడా విన్లేదే! ‘ఫ్రాయిడ్’ కూడా ఎప్పుడూ అన్లేదే అని విస్తుపోయేడు అబ్బాయి, ఓో! మా ఇద్దరిదీ కల అన్న మాట. అయితే కలలు కనడం మనుషుల జాగీరా? మేం కనకూడదని, మేం కనలేమని ఉపనిషత్తుల్లో, వేదాల్లో ఏమైనా రాశారా? అంది డాగీ. అయిదేళ్ల కోసం నాయకుడ్ని ఎన్ను కుంటే, రాబోయే ముప్ఫయి ఏళ్ల దాకా నాదే రాజ్యం అనడంలా కలలు కనడంలా ? మేమంత పొడుగు ఆలోచించడం లేదులే అంది డాంకీ. సారీ! కలలు కనడం మనషుల హక్కు కాదులే. మీరు డాగీ గానూ డాంకీ గానూ పుట్టాల్సినంత క్రైమ్ చెయ్యలేదనే అనుకుందాం. కానీ ఎవరికి ఎక్కడ వడ్డించాలో ఎవరి ముందు విస్తరి లాగెయ్యాలో వడ్డించేవాడు కదా నిర్ణయించేది అన్నాడు అబ్బాయి. అయితే ఊరికే ఉద్యోగం కోసం దేబరించ¿ £పోతే రాజ్యసభకు వెళ్లిపోరాదూ, ఓ వడ్డించేవాడి గడ్డం పట్టుకు బతిమాలి అంది పళ్లికిలిస్తూ డాంకీ. అదంతా ఆషామాషీ వ్యవహారం కాదు. ఏదో ఓ కుంటిసాకుతో మోకాలు అడ్డుపెట్టే వాళ్లుంటారు అన్నాడు అబ్బాయి. సాకు అనగా ఉత్త్తుి ‘క్రైమే’ కదా. నువ్వతన్నట్టు వడ్డించేవాడు మనవాడు కాదు గనక నేను డాంకీనై పుట్టాల్సి వచ్చింది అన్నది డాంకీ. ఆ మాటే ‘రిపీట్’ చేసింది డాగీ.


