Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్విన్సెంట్ ఫెర్రర్ మెమోరియల్ వృద్ధుల దివ్యాంగుల త్రైమాసిక గ్రామీణ వైద్య శిబిరములు సద్వినియోగం చేసుకోండి..

విన్సెంట్ ఫెర్రర్ మెమోరియల్ వృద్ధుల దివ్యాంగుల త్రైమాసిక గ్రామీణ వైద్య శిబిరములు సద్వినియోగం చేసుకోండి..

డాక్టర్ సత్య నిర్ధారన్
విశాలాంధ్ర ధర్మవరం:: విన్సెంట్ ఫెర్రర్ మెమోరియల్ వృద్ధుల దివ్యాంగుల త్రైమాసిక గ్రామీణ వైద్య శిబిరములు ఈనెల 23వ తేదీ మండల పరిధిలోని ధర్మపురి గ్రామంలో గల మండల పరిషత్ యూపీ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు క్యాంపు ఆర్గనైజర్ డాక్టర్ చిందులూరు సత్య నిర్ధారన్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మపురి గ్రామంలోని ఎంపీ యుపిఎస్ పాఠశాలలో నేత్ర, దంతా, వివిధ రకాల జబ్బుల ఉచిత చికిత్స శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం డాక్టర్ సత్య నిర్ధారన్ మాట్లాడుతూ సంవత్సరంలో మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ నెల యందు ఉచిత చికిత్స శిబిరములను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్లు ఎం. సాహిద్, డాక్టర్. మనోజ్ కుమార్, డాక్టర్ ఎం, నాగరాజు ఆచారి, డాక్టర్ రమ్యత బండి, ఎస్. వి. రాజు- బెంగళూరు వారు రోగులకు వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంవత్సరాలుగా వినూత్న రీతిలో ఁవృద్ధుల ప్రాధాన్యత వైద్య శిబిరాలనుఁధర్మవరం ఎన్జీవోల సహకారంతో గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మూడు నెలలకు ఒకసారి ధర్మపురి గ్రామములో వైద్య శిబిరములను నిర్వహించేందుకు యువర్స్ ఫౌండేషన్ రావడం పట్ల వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇటీవల పెనుగొండలో జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెహర్ బాబా సెంటర్ అధ్యక్షురాలు సుజాతకు మహిళా శిరోమణి అవార్డు రావడం పట్ల ప్రత్యేక అభినందన శుభాకాంక్షలు తెలుపుతూ, పాఠశాలలో కూడా సుజాతను గౌరవంగా సత్కరించి అభినందనలు తెలిపారు. తదుపరి పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు, బుక్స్, పెన్నులు తదితర విద్యాసామాగ్రిని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు నాగేంద్ర, మెహర్ బాబా సెంటర్ అధ్యక్షురాలు సుజాత, మెహర్ బాబా వృద్ధుల వైద్య శిబిరం నిర్వాహకులు కృష్ణమూర్తి, బీరే శ్రీరాములు, పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు