Saturday, May 31, 2025
Homeసాహిత్యంవివిధ అంశాల కలయిక ‘పూలహారం’

వివిధ అంశాల కలయిక ‘పూలహారం’

గెల్లి రామమోహనరావు, ఫోన్‌: 08632357514 రచయిత ఈ ‘పూలహారం’ లో ఎనిమిది అంశాలను గూర్చి చెప్పారు. నామిని ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు. కొంతమంది ఊరు చూడమంటే ఉత్తరం చూస్తారు. కొందరే ఊరిని చూస్తారు.వరద రాజేశ్వరరావు రచయిత. ‘కవన కుతూహలం’ పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అందులో తన అనుభవాలు, ఆయా వ్యక్తుల వైఖరి ఉన్నది. ప్రతి వ్యాసం కుతూహలమే. ‘బాపు’ అంటే తెలియని వారుండరు. కొన్ని తెలుగు చిత్రాలను తెరకెక్కించిన కళాకారులు. ‘విస్తరాకు’ లో నామిని పత్రికల్లో అనుభవాన్ని వివరించారు. మీరు కూడ యీ భూమిని పుట్టగూడని మహాన్నభావుడికొక దండం పెట్టుకోండి. ‘తండ్రీకూతుళ్ల కథ. గళ్లా కుటుంబం మీద నాయుడు కథ చెప్పారు. చివరిగా ఒక వ్యాసంలో నాయుడు తన బతుకు పాట్లు యావత్తూ వివరించారు. ఇందులో కొన్ని పదాలు చిత్రంగా ఉన్నాయి. మరికొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎన్నో విషయాలను తట్టలతో, బుట్టలతో రచయిత అందించారు. పూలహారం నామిని సుబ్రమణ్యం నాయుడు, ప్రచురణ: అభినవ ప్రచురణ, తిరుపతి,
వెల: రూ 100/` పేజీలు: 80, ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ బుక్‌హౌస్‌

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు