ఖాటˆండు: నేపాల్‌లో ఆకస్మిక వరద మారణహోమం సృష్టించింది. భవన శిథిలాలు, పేరుకుపోయిన బురద కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయడానికి సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. మంగళవారానికి మృతుల సంఖ్య 1,015కు చేరింది. 3,916 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అటు చైనా వైపు 16 మంది చనిపోగా, మరో 546 మంది జాడ లేరు. శిథిలమైన నువాకోట్‌లోని భవనంలో 23 మృతదేహాలు లభ్యమయ్యాయి. అవి కుళ్లిపోయి ఉండడంతో సామూహిక ఖననం చేశారు. నేపాల్`చైనా సరిహద్దులో ఇప్పటివరకు 978 మృతదేహాలు లభ్యమయ్యాయి. భారత్, చైనా, సింగపూర్, దక్షిణ కొరియా సహా అనేక దేశాల మద్ద తుతో నేపాల్ సహాయక చర్యలను ముమ్మ రం చేసింది. రసువా, నువాకోట్‌లోని సుమారు ఆరు సొరంగాలు, 11 ప్రాజెక్టు లలో 930 మందికిపైగా కార్మికులు చిక్కుకు పోయారని అధికారులు వెల్లడించారు. ఆయా ప్రాంతాలను చేరుకునేందుకు సహా యక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సొరంగం చుట్టూ పేరుకుపోయిన దట్టమైన బురద, ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుల జాడ కోసం వెతుకుతున్న వేలాది మందితో ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. ఒకే మృతదేహాన్ని తమ బంధువుగా పేర్కొంటూ మూడు కుటుంబాలు ముందుకు రావడంతో సందిగ్ధత నెలకొంది. మృతదేశాల గుర్తింపులో తీవ్ర జాప్యం సవాల్‌గా మారినట్లు అధికారులు వెల్లడించారు. సమస్యల నివారణకు మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కాగా, నేపాల్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గండక్ నదిలోకి 13 మృతదేహాలు కొట్టుకురాగా, వాటిని స్థానిక అధికారులు తిరిగి నేపాల్కు అప్పగించారు.
వెయ్యి దాటిన మృతులు
- Advertisement -
RELATED ARTICLES


