Wednesday, April 2, 2025
Homeవ్యాపారంవేసవి నేపథ్యంలో ఏసీ డీల్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌ నూతన ప్రచారం

వేసవి నేపథ్యంలో ఏసీ డీల్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌ నూతన ప్రచారం

వరంగల్‌: భారతదేశ స్వదేశీ ఇ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ఫ్లిప్‌కార్ట్‌ తీవ్రమైన వేసవి వేడిని ఎదుర్కోవడానికి సాటిలేని ఆఫర్‌లను మిళితం చేసి ‘ఏసి డీల్స్‌ సో గుడ్‌, ఇండియా రహేగా కూల్‌’ అనే కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. 22 ఫీట్‌ ట్రైబల్‌ వరల్డ్‌వైడ్‌ ఆధ్వర్యంలో ఫ్లిప్‌కార్ట్‌ ప్రచారం రూపొందించినట్టు
ఫ్లిప్‌కార్ట్‌ మీడియా విభాగ హెడ్‌ ప్రతీక్‌ శెట్టి అన్నారు. ఎయిర్‌ కండిషనర్లు, ఫ్యాన్లు, కూలర్లు వంటి చల్లదనపు పరిష్కారాలు వేసవి వేడి, చికాకుల నుండి ఉపశమనాన్ని ఎలా అందిస్తాయో ఈ ప్రచారం వెల్లడిస్తుందన్నారు. ఈ ప్రచారం మార్చి 26 నుంచి 31 వరకు జరిగే ఫ్లిప్‌కార్ట్‌ కూలింగ్‌ డేస్‌తో పాటుగా జరుగుతుందన్నారు. ఈ ప్రచారంలో భాగంగా రూ.26,490 నుండి ప్రారంభమయ్యే ఎయిర్‌ కండిషనర్లు, రూ.1,999 నుండి ప్రారంభమయ్యే విద్యుత్‌ ఆదా చేసే ఫ్యాన్‌లు రూ.3,999 నుండి ప్రారంభమయ్యే కూలర్‌ల వంటి ఉత్పత్తులను అందిస్తున్నామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు