Thursday, April 3, 2025
Homeఅంతర్జాతీయంశవాల దిబ్బగా మైన్మార్‌

శవాల దిబ్బగా మైన్మార్‌

తవ్వేకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు

నేపీడా : గతవారం సంభవించిన భారీ భూకంపంతో మైన్మార్‌లో పరిస్థి తులు భయానకంగా మారాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకు పోయి ఉండటంతో తవ్వే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. దీంతో మైన్మార్‌ శవాల దిబ్బగా మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడతారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఓ వైపు అంతర్యుద్ధం, మరోవైపు భూకంపం కారణంగా మైన్మార్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. దీంతో మాన వతా సాయానికి ఆటంకం కలుగు తోంది. ఈ క్రమంలో బాధితులకు నిరాటంకంగా మానవతా సాయాన్ని అందనివ్వాలని జుంటా ప్రభుత్వానికి మానవ హక్కుల సంఘాలు విన్నవిం చాయి. ఆ మేరకు మైన్మార్‌ పాలకు లపై ఒత్తిడి తేవాలని కూడా అంతర్జా తీయ సంఘాలకు పిలుపునిచ్చాయి. సహాయక చర్యలు బుధవారం కూడా కొనసాగాయి. ఇప్పటివరకు 2,886 మరణించినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. గాయపడిన వారి సంఖ్య 4,639గా ఉంటే 373 మంది ఆచూకీ లేరని మీడియా నివేదికలు వెల్లడిరచాయి. పక్క దేశమైన థాయిలాండ్‌నూ భూకంపం కుదిపివేయగా… అక్కడి మృతుల సంఖ్య 22కు పెరిగింది. మరో 72 మంది ఆచూకీ లేరు. కొన్ని వందల భవనాలు కూలిపోయాయి. భూకంప ప్రభావిత ఆరు ప్రాంతాల్లో 2.8 కోట్ల మందికిపైగా బాధితులు ఉన్నారని ఐక్య రాజ్య సమితి (ఐరాస) వెల్లడిరచింది. బాధితులకు అత్యవసర సాయం అందించేందుకు 12 మిలియన్‌ డాలర్లు కేటాయించినట్లు తెలిపింది. ఆహారం, ఆశ్రయం, నీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం తదితరాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. 1.5 మిలియన్‌ యువాన్ల ఆర్థిక సాయాన్ని మైన్మార్‌కు చైనా అందించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు