- Advertisement -
న్యూఢిల్లీ: హైడ్రాకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కంటోన్మెంట్ లోని 40 ఎకరాల భూమి ప్రభుత్వాని దేనంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ఈ తీర్పు వెలువరిం చింది. కంటోన్మెంట్లోని వివాదా స్పద 40 ఎకరాల భూమి శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్దేనని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ… ఇది ప్రభుత్వ భూమి అని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను ఏకంగా 219 రోజుల ఆలస్యంగా దాఖలు చేశారనే కారణంతో జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం డిస్మిస్ చేసింది.


